కోటిన్నర పైగా ఖర్చు పెట్టి సైనా నెహ్వాల్ ఎం కొన్నదో తెలుసా.. లుక్స్ వేరే లెవెల్..

First Published | Nov 25, 2023, 5:46 PM IST

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్  సైనా నెహ్వాల్,  పారుపల్లి కశ్యప్ ఖరీదైన Mercedes Benz AMG GLE SUVని కొన్నారు. క్రికెటర్లు, క్రీడాకారులు, సెలబ్రిటీలు ఈ కారును ఎందుకు ఎక్కువగా కొంటున్నారో  తెలుసా.. ?
 

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్స్  సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇంటికి కొత్త అతిథిని స్వాగతం పలికారు. ఈసారి బ్యాడ్మింటన్ స్టార్ ఇంటికి అతిథిగా రూ.1.71 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ AMG GLE SUV వచ్చి చేరింది.
 

సైనా నెహ్వాల్, కశ్యప్‌లు ఖరీదైన లగ్జరీ మెర్సిడెస్ కారును సొంతం  చేసుకున్నారు. దీంతో ఖరీదైన కార్లు కలిగిన లిస్ట్ లో సైనా నెహ్వాల్ ఇప్పుడు చేరిపోయింది.
 


Mercedes Benz AMG GLE కాకుండా, సైనా నెహ్వాల్ దగ్గర BMW X6, BMW 3 సిరీస్, మినీ కూపర్, హ్యుందాయ్ క్రెటా కార్లు కూడా  ఉన్నాయి.
 

Mercedes Benz AMG GLE కారులో 21 అంగుళాల అల్లాయ్ వీల్స్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఎన్నో ఇతర లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
 

Mercedes-Benz AMG GLE 3.0-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 435 hp శక్తిని, 520 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0-100 kmph స్పీడ్ కేవలం 3.8 సెకన్లలో అందుకుంటుంది. Mercedes Benz AMG GLE కారు టాప్ స్పీడ్ గంటకు 280 కిలోమీటర్లు.
 

దీనిలో హై   సెక్యూరిటీ  ఫీచర్స్ ఉన్నాయి. ABS, EBD బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, గ్లోబల్ ఎన్‌క్యాప్స్ క్రాష్ టెస్ట్ రేటింగ్‌ ప్రయాణీకులకు మరింత భద్రతను అందిస్తాయి.

ఈ Mercedes Benz AMG GLE కారులో క్లైమేట్ కంట్రోల్, 13 స్పీకర్లు, వెంటిలేటెడ్ సీట్లు, 64 రకాల యాంబియంట్ లైట్ వంటి ఎన్నో అప్ గ్రేడ్  ఫీచర్లు ఉన్నాయి.
 

Latest Videos

click me!