కియా సోనెట్ మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో అందించబడుతుంది - 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టి-జిడిఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ మోటారు డబ్ల్యుజిటితో మాన్యువల్ ఇంకా విజిటి ఆటోమేటిక్‌లో అందిస్తోంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6,300 ఆర్‌పిఎమ్ వద్ద 82 బిహెచ్‌పి అలాగే 4200 ఆర్‌పిఎమ్ వద్ద 115 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది, దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. ఇప్పుడు మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ 1.0-లీటర్ జిడిఐ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 118 బిహెచ్‌పి, 1500-4000 ఆర్‌పిఎమ్ వద్ద 172 ఎన్‌ఎమ్లను అందిస్తుంది. కియా ఈ ఇంజన్‌తో రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో ఒకటి 6-స్పీడ్ ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) మరొకటి 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్.
డీజిల్-శక్తితో పనిచేసే కియా సోనెట్ రెండు వెర్షన్లను పొందుతుంది. ఇందులో 1.5-లీటర్ సిఆర్‌డిఐ డబ్ల్యుజిటి (వేస్ట్-గేట్ టర్బోచార్జర్) ఇంకా 1.5-లీటర్ సిఆర్‌డిఐ విజిటి (వేరియబుల్-జియోమెట్రి టర్బోచార్జర్). మొదటి వెర్షన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 99 బిహెచ్‌పి, 1500 నుండి 2750 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ అందించడానికి ట్యూన్ చేయబడింది, దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా అందించారు. 1.5-లీటర్ సిఆర్‌డిఐ విజిటి ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 113 బిహెచ్‌పి, 1500-2750 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఇస్తుంది, దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్‌తో అందించారు.
కియా సోనెట్ రెండు ముఖ్యమైన ట్రిమ్‌లలో అందింస్తున్నారు. అందులో ఒకటి జిటి-లైన్ రెండోది టెక్-లైన్. మొదటిది టాప్-స్పెక్ వేరియంట్, జిటిఎక్స్ + లో మాత్రమే అందించబడుతుంది, తరువాత 5 కీ వేరియంట్‌లలో వస్తుంది ఇందులో హెచ్‌టిఇ, హెచ్‌టికె, హెచ్‌టికె + , హెచ్‌టిఎక్స్ ఇంక్ హెచ్‌టిఎక్స్ + ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కియా సోనెట్ ప్రారంభ ధర రూ.6.79 లక్షల నుండి మోదలై రూ.13.19 లక్షల వరకు ఉంటుంది.