బిఎమ్‌డబ్ల్యూ ఎం స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ : కోట్ల విలువైన ఈ లగ్జరీ కార్ స్పెషాలిటీ ఎంటో తెలుసా..

First Published Aug 4, 2021, 11:42 AM IST

జర్మని లగ్జరీ కార్ బ్రాండ్  బిఎమ్‌డబ్ల్యూ మంగళవారం ఇండియన్ మార్కెట్లోకి ఇండివిడ్యువల్ 740ఎల్‌ఐ ఎమ్ స్పోర్ట్ ఎడిషన్ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ సెడాన్ స్టాండర్డ్ 7-సిరీస్‌తో పోలిస్తే ప్రత్యేకంగా అందించే గొప్ప ఫీచర్లతో వస్తుంది.

భారతదేశంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండివిడ్యువల్ 740ఎల్‌ఐ ఎమ్ స్పోర్ట్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ .1,42,90,000. ఈ కొత్త కారును లిమిటెడ్ సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ  తెలిపింది. పేరు సూచించినట్లుగా 740ఎల్‌ఐ ఎమ్ స్పోర్ట్ ఎడిషన్ ఎం స్పోర్ట్ ప్యాకేజీతో స్టాండర్డ్ గా వస్తుంది. ఇందులో పెద్ద వెంట్‌లతో కూడిన బెస్‌పోక్ ఫ్రంట్ బంపర్ అండ్ ట్విన్ ఎగ్జాస్ట్‌లతో స్పోర్టివ్ రియర్ ఎండ్ ఇచ్చారు. ఈ కారులో బిఎమ్‌డబ్ల్యూ లేజర్‌లైట్ టెక్నాలజీ అండ్ 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
 

కార్ల తయారీ సంస్థ క్లెయిమ్ చేసినట్లుగా బి‌ఎం‌డబల్యూ ఇండివిడ్యువల్ 740ఎల్‌ఐ ఎం స్పోర్ట్ ఎడిషన్ ఆటోమేకర్స్ ఫ్లాగ్‌షిప్ సెడాన్‌ను హ్యాండ్‌క్రాఫ్టెడ్ పర్సనలైజేషన్ అండ్ ఎం పెర్ఫార్మెన్స్‌తో  లైఫ్ ఇచ్చింది. దీనిని  చెన్నై ప్లాంట్‌లో స్థానికంగా తయారుచేయనున్నారు.

ఇంటీరియర్ అండ్ లుక్స్

740ఎల్‌ఐ ఎమ్ స్పోర్ట్ ఎడిషన్ రెండు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్ తో ప్రారంభించారు. ఇంటీరియర్‌ గురించి మాట్లాడితే  కారు ఆల్కాంటారా హెడ్‌రెస్ట్ అండ్ బ్యాక్‌రెస్ట్ కుషన్‌లతో కస్టమైజ్డ్ ఎంబ్రాయిడరీ, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌పై బి‌ఎం‌డబల్యూ ఇండివిడ్యువల్ ఇంటీరియర్ ట్రిమ్ బ్యాడ్జింగ్, ఐవరీ వైట్‌లో అల్కాంటారా హెడ్‌లైనర్, కాన్బెర్రా బీజ్ హైలైట్‌లు, నప్పా లెదర్ అప్‌హోల్స్టరీ లభిస్తాయి.
 

740ఎల్‌ఐ ఎం స్పోర్ట్ ఎడిషన్ కారు ఫీచర్ల గురించి మాట్లాడితే ఎల్‌ఈ‌డి లైట్ గ్రాఫిక్స్, యాంబియంట్ ఎయిర్ ప్యాకేజీ, అంబియెంట్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ స్కై లాంజ్‌ ఇచ్చారు. ఇతర ఫీచర్లలో 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కంఫర్ట్ సీట్లు, మసాజ్ ఫంక్షన్ అండ్ యాక్టివ్ సీట్ వెంటిలేషన్, రియర్ సీట్ వెంటిలేషన్, హీటింగ్, లామినేటెడ్ గ్లాస్ అండ్ విండ్ స్క్రీన్, సాఫ్ట్ క్లోజ్ డోర్స్ ఉన్నాయి.

డైనమిక్ డాంపర్ కంట్రోల్‌తో అడప్టివ్ 2-యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్, రెండు 10.2-అంగుళాల ఫుల్-హెచ్‌డి డిస్‌ప్లేలతో బ్యాక్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొఫెషనల్, బ్లూ-రే ప్లేయర్, బి‌ఎం‌డబల్యూ టచ్ కమాండ్, 7-అంగుళాల టాబ్లెట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేశ్చర్ కంట్రోల్, హర్మన్ కార్డాన్ 16-స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా అందించారు.

భద్రతా ఫీచర్లు

740ఎల్‌ఐ వివిధ డ్రైవర్ ఆసిస్టంట్ సిస్టంతో వస్తుంది, ఇందులో లేన్ చేంజ్ వార్నింగ్ తో డ్రైవింగ్ అసిస్టెంట్, రెర్ కొలిజన్ వార్నింగ్, క్రాసింగ్ ట్రాఫిక్ వార్నింగ్, పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్‌తో సరౌండ్ వ్యూ కెమెరా, రివర్స్-కంట్రోల్ పార్కింగ్ ఫంక్షన్‌తో రివర్సింగ్ అసిస్టెంట్ ఉన్నాయి. 
 

ఇంజిన్ మరియు పవర్

740ఎల్‌ఐ ఎం స్పోర్ట్ ఎడిషన్‌లో 3.0 లీటర్, ఇన్-లైన్ 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 5,500-6,500 ఆర్‌పిఎమ్ వద్ద 335 బిహెచ్‌పి పవర్, 1,500-5,200 ఆర్‌పిఎమ్ వద్ద 450 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ అందించారు. 

undefined
click me!