సియామ్ కీలక నిర్ణయం.. కరోనా భయంతో ఆటో ఎక్స్‌పో -2022 వాయిదా..

First Published Aug 3, 2021, 4:50 PM IST

ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2022 వాయిదా పడినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్‌ఐ‌ఏ‌ఎం) సోమవారం తెలియజేసింది.  ఆటో ఎక్స్‌పో - ది మోటార్ షో 2022 వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు గ్రేటర్ నోయిడాలో జరగాల్సి ఉంది. 

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా   కారణంగా  తేదీలను వాయిదా వేసినట్లు ఎస్‌ఐ‌ఏ‌ఎం తెలిపింది. సియామ్ ప్రకారం  ఈ కార్యక్రమంలో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ ఏడాది చివర్లో ఆటో ఎక్స్‌పో -2022 కోసం కొత్త తేదీలని పరిశీలిస్తామని సియామ్ తెలిపింది. 
 

ఇంత పెద్ద స్థాయి కార్యక్రమానికి సిద్ధం కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ప్రస్తుత కరోనా మహమ్మారి సంబంధిత పరిస్థితుల దృష్ట్యా ఈవెంట్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం తెలివైన పని కాదని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ అభిప్రాయపడ్డారు. 
 

 ఆటో ఎక్స్‌పో అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం. దీనిని సాధారణంగా ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఇందులో కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించడానికి ఓ‌ఈ‌ఎంలకు ఒక వేదికను అందిస్తుంది. కార్ల ప్రేమికులు ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొంటారు. ఈ కార్యక్రమం చివరిసారిగా 2020లో దేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ముప్పు ఉద్భవించినప్పుడు జరిగింది.
 

 రాజేష్ మీనన్ ప్రెస్‌కి విడుదల చేసిన ఒక ప్రకటనలో, "ఎక్స్‌పోలో పాల్గొన్న అలాగే ప్రస్తుతం ఉన్న ఎగ్జిబిటర్‌లు, సందర్శకులు, వాటాదారులందరి భద్రత పై సియామ్  అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆటో ఎక్స్‌పో నిర్వహించడం వల్ల కలిగే నష్టాలను అర్థం చేసుకోవడం ముఖ్యం అని  తెలిపారు.
 

రాజేష్ మీనన్ ఆటో ఎక్స్‌పో వంటి బి 2 సి ఈవెంట్ ద్వారా కరోనా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సాధారణంగా పెద్ద జనసమూహం వస్తుంది అలాగే సామాజిక దూరాన్ని నిర్వహించడం కూడా  'కష్టం'. అని అన్నారు.
 

click me!