భారతదేశంలోకి ఫీచర్స్-లోడెడ్ మెషిన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు.. ధర కూడా తక్కువే..

First Published | Aug 3, 2021, 1:29 PM IST

 ఎలక్ట్రిక్ వాహన రంగంలో  కొత్త వెంచర్ అయిన ఈ‌విట్రిక్ మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో ఈ‌విట్రిక్ ఆక్సిస్ అండ్ ఈ‌విట్రిక్ రైడ్ ఉన్నాయి. భారతీయ మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ. 64,994. ఈ రెండూ కూడా స్లో స్పీడ్ కేటగిరీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ‌విట్రిక్ ఆక్సిస్  ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,994 గా నిర్ణయించారు. 

అయితే ఈ‌విట్రిక్ రైడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.67,996.  ఈ‌విట్రిక్ భారతదేశంలో ఇ-మొబిలిటీ మిషన్‌ చొరవకు అనుగుణంగా ఈ ఉత్పత్తులను ప్రారంభించింది. పర్యావరణ అనుకూలమైన రవాణాను భారతదేశంలోని యువత, కుటుంబ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ  ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది. పి‌ఏ‌పి‌ఎల్ అనేది భారతదేశానికి చెందిన ఒక ఆటోమేషన్ కంపెనీ.  కంపెనీ వినియోగదారుల కోసం సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ‌వి మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లతో సహా ఉత్తమ శ్రేణి ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను అందించే దిశగా పని చేస్తుంది.
 

ఇ-స్కూటర్ కి డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ లభిస్తుంది. అలాగే 250W మోటార్ అవుట్‌పుట్‌ను పొందుతుంది ఇంకా 150 కేజీల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు ఇ-స్కూటర్ల బ్యాటరీ దాదాపు 3.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని చేరుకోగలదు.
 


ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో  ఆకర్షణీయమైన ఫీచర్లను ఇచ్చారు. ఎగుడుదిగుడు రోడ్లపై ఒత్తిడి లేని రైడ్ కోసం ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, రోబోటిక్ వెల్డింగ్ వీల్, సైడ్ స్టాండ్ సెన్సార్‌లు, 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్‌లను 190 ఎం‌ఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో అందించారు. ఈ-స్కూటర్‌లు ప్రత్యేకమైన రివర్స్ పార్క్ అసిస్ట్ ఫంక్షన్‌తో ఈ‌వి  వినియోగదారుల అనుభవాన్ని మరింత పెంచుతాయి. అందువల్ల ఈ స్కూటర్ ఒక ఫీచర్-లోడెడ్ మెషిన్. ఈ‌విట్రిక్ కస్టమర్‌ల కోసం బ్రాండ్ ప్రత్యేక ఫీచర్‌లతో పాటు 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీని అందిస్తోంది.
 

 మొదటి దశలో ఢిల్లీ, గుర్గావ్, పూణే, ఔరంగాబాద్, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్‌తో సహా 7 నగరాల్లో ఈ-స్కూటర్లను కంపెనీ విక్రయించనుంది. ఈ బ్రాండ్ 6 నెలల స్వల్ప వ్యవధిలో దేశంలోని 28 రాష్ట్రాలలో (కేంద్రపాలిత ప్రాంతాలతో సహా) అన్ని రాజధాని నగరాల్లో ఉనికిని వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉంది.  
 

ఈ‌విట్రిక్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ వ్యవస్థాపకుడు మనోజ్ పాటిల్ మాట్లాడుతూ, "మేము ఒక దశాబ్దానికి పైగా ఆటోమేషన్ రంగంలో ఉన్నాము. ఇప్పుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆటోమొబైల్ విప్లవంగా దీనిని నడిపిస్తున్నాము. ప్రస్తుత టెక్నాలజిని పరిగణనలోకి తీసుకుంటే వినియోగదారుల ప్రతిరోజు రాకపోకలకు  ఈ స్కూటర్ బడ్జెట్ కొనుగోలు అవుతుంది. ఈ ఉత్పత్తులు కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా ఉంటాయి, తద్వారా  మరింత ఆర్థికంగా ప్రయాణించగలుగుతారు.మధ్యప్రదేశ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటకలో ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర ప్రదేశ్‌లో విస్తరించడానికి  బ్రాండ్ ఇప్పటికే డీలర్షిప్లను ప్రారంభించింది.

Latest Videos

click me!