కొత్త కారు కొనాలని ఉందా? కానీ బడ్జెట్ 5 లక్షలు మాత్రమే ఉందా? అయితే ఏ మాత్రం చింతించకండి. ఈ బడ్జెట్‌లో కూడా 25 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, సేఫ్టీ ఫీచర్లు, ఇంజిన్ తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారి దృష్టిని ఆకర్షించే మోడల్స్‌లో మారుతి సుజుకి ఆల్టో K10 ఒకటి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.69 లక్షలు మాత్రమే. 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 5 స్పీడ్ మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 24.39 కి.మీ, ఏఎమ్‌టీ వేరియంట్ 24.90 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా వస్తుంది.
24
మారుతి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
ఎస్‍యూవీ లాంటి లుక్ ఉండే చిన్న కారు కావాలనుకునే వారికి మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఆప్షన్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.49 లక్షలు. 998 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 24.76 కి.మీ, ఏఎమ్‌టీ వేరియంట్ 25.30 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. బేస్ వేరియంట్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉంటాయి. కొన్ని ఎంపిక చేసిన వేరియంట్లలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కూడా ఉంది.
34
రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)
బడ్జెట్ ధరలో డిఫరెంట్ డిజైన్ కోరుకునే వారికి రెనాల్ట్ క్విడ్ కారు పర్ఫెక్ట్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.52 లక్షలు. 999 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు మాన్యువల్, ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు సుమారు 21.46 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
279 లీటర్ల బూట్ స్పేస్, 184 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఈ క్విడ్ ప్రత్యేకతలు. బేస్ మోడల్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. కాస్త ఎక్కువ ధర ఉండే క్లైంబర్ వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తాయి.
రూ.5 లక్షల్లోపు లభించే మరో బెస్ట్ ఆప్షన్ టాటా టియాగో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.4.77 లక్షలు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠం 85 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. విశాలమైన క్యాబిన్, కుటుంబ ప్రయాణానికి అనువైన డిజైన్ దీని సొంతం. అయితే, కేవలం బేస్ వేరియంట్ మాత్రమే రూ.5 లక్షల్లోపు లభిస్తుంది.