బైక్ లాగా సౌండ్ చేసే బెనెల్లి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇండియాలో దీని ధర ఎంతో తెలుసా ?

First Published May 4, 2021, 12:53 PM IST

ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బెనెల్లి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డాంగ్ ను ప్రవేశపెట్టింది. బెనెల్లి సంస్థ 100 సంవత్సరాల పురాతనమైనది, అలాగే బైక్స్  తయారీకి ప్రసిద్ధి చెందింది. 

2005లో చైనాలోని కియాన్‌జియాంగ్ గ్రూప్ దీనిని కొనుగోలు చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డాంగ్‌ను నిర్మించడానికి చైనీస్ టెక్నాలజీని ఉపయోగించి ఆసియా మార్కెట్ల కోసం అభివృద్ధి చేసింది.
undefined
ప్రత్యేకమైన డిజైన్భారతీయ మార్కెట్లోకి బెనెల్లి డాంగ్ ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు భావిస్తున్నారు. బెనెల్లి డాంగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా చిన్నది, ఇది ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే స్కూటర్ వెనుక భాగం పైకి తెలుస్తున్నట్లు కనిపిస్తుంది. దీని వెనుక భాగం సెంట్రల్ షాఫ్ట్ ద్వారా ఫ్లోర్‌బోర్డ్‌కు అనుసంధానించి ఉంటుంది. సెంట్రల్ షాఫ్ట్ అల్యూమినియంతో తయారు చేసినట్లు కనిపిస్తుంది. స్కూటర్ ముందు భాగం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి రెండు ఎల్‌ఈడీ ఇండికేటర్స్ తో పాటు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌సిడి డిస్‌ప్లే లభిస్తుంది.
undefined
బ్యాటరీ అండ్ డ్రైవింగ్ బెనెల్లి ప్రకారం ఈ స్కూటర్‌లో 1.2 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారు అందించారు. ఇది గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్కూటర్‌లో 1.56 కిలోవాట్ల రిమువబుల్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ స్కూటర్ 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌లో ఆర్టిఫిషియల్ ఎగ్జాస్ట్ సౌండ్ ఫీచర్‌ను ఇచ్చింది. ఇందుకు స్కూటర్‌లో స్పీకర్లు కూడా ఇచ్చారు, తద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పెట్రోల్ వాహనంల విభిన్న స్పౌండ్స్ చేయగలదు, అంతేకాదు పెట్రోల్ ఇంజన్ బైక్ కి సమానమైనంగా అనిపిస్తుంది. కావాలనుకుంటే డ్రైవర్ ఈ స్పీకర్లను ఆఫ్ కూడా చేయవచ్చు.
undefined
ధరబెనెల్లి డాంగ్ స్కూటర్‌ను మొదట ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేశారు. అక్కడ ఈ స్కూటర్ ధర ఆర్‌పి.36,900,000 (ఇండోనేషియా కరెన్సీ)గా నిర్ణయించారు. భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.9 లక్షలు. 2020 నాటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇండియాలోకి తీసుకురావాల్సి ఉంది, కానీ కరోనా మహమ్మారి కారణంగా ఆ ప్రణాళికలు వాయిదా పడ్డాయి. భారతదేశంలో బెనెల్లి సంస్థ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఇదేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
undefined
undefined
click me!