కొత్త స్టైలిష్ గ్రాఫిక్స్ తో బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే ?

First Published | Apr 27, 2021, 6:37 PM IST

 ఇండియన్ మల్టీ నేషనల్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో  పల్సర్  'డాగర్ ఎడ్జ్' ఎడిషన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్  పల్సర్  లైనప్‌లో పల్సర్ 150, పల్సర్ 180, పల్సర్ 220 ఎఫ్ వంటి మోడళ్లు ఉన్నాయి. 

వీటితో పాటు కొత్తగా డాగర్ ఎడ్జ్ ఎడిషన్ పల్సర్ బైక్ ను చాలా ఆకర్షణీయమైన రూపంతో పరిచయం చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కొత్త కలర్, గ్రాఫిక్స్ ఇచ్చింది. బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్‌లో ఎలాంటి మార్పులు ఉన్నాయో తెలుసుకుందాం.
కొత్త కలర్ స్కీమ్ ప్రత్యేకత ఏమిటిపల్సర్ 150 డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్‌లో రెండు మాట్టే కలర్ స్కీమ్‌లు ఉన్నాయి. వీటిలో పెర్ల్ వైట్ అండ్ సఫైర్ బ్లూ ఉన్నాయి. పెర్ల్ వైట్ కలర్ స్కీమ్ లో మడ్ గాడ్స్ ఇంకా రిమ్స్ పై రెడ్ కలర్ హైలెట్ చేస్తుంది. సఫైర్ బ్లూ కలర్ స్కీమ్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్స్ ఇంకా రిమ్స్‌లో వైట్ కలర్ హై లెట్ చేస్తుంది. పల్సర్ లైనప్‌లో తదుపరి బైక్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్‌లోని పెర్ల్ వైట్, వోల్కనో రెడ్, స్పర్కిల్ బ్లాక్ మాట్టే కలర్ ఆప్షన్స్. వోల్కనో రెడ్ కలర్ లో తెలుపు-నలుపు గ్రాఫిక్స్ హై లెట్ చేస్తాయి. కాగా స్పర్కిల్ బ్లాక్ ఆప్షన్ రెడ్ గ్రాఫిక్స్ హై లెట్ అందిస్తుంది. ఈ నాలుగు కలర్ ఆప్షన్స్ పల్సర్ 220 ఎఫ్‌లో లభిస్తాయి. కొత్త పెయింట్ స్కీమ్ తప్ప బైక్‌లో ఎటువంటి మార్పు లేదు.

పల్సర్ ఇంజిన్బజాజ్ పల్సర్ 150 సిసి బైక్‌కి 149.5 4-స్ట్రోక్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.8 బిహెచ్‌పి, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ పల్సర్ 180 సిసి బైక్‌లో 178.66 ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.8 బిహెచ్‌పి శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14.52 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 220 సిసి ఇంజన్ టాప్ మోడల్ 220 ఎఫ్‌లో ప్లేసర్ రేంజ్‌లో లభిస్తుంది. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 బిహెచ్‌పి శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 18.55 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ధర ఎంతబజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ బైక్ ధరలుమోడల్ ధర (రూ.)పల్సర్ 150 రూ.1,01,818పల్సర్ 150 ట్విన్-డిస్క్ రూ.1,04,819పల్సర్ 180 రూ.1,09,651పల్సర్ 220 ఎఫ్ రూ.1,28,250

Latest Videos

click me!