50 వేలలో అధిక మైలేజ్ అందిస్తున్న ఇండియాలోని 6 బెస్ట్ బైక్స్ ఇవే..

First Published | Apr 24, 2021, 1:47 PM IST

భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుండి  ద్విచక్ర వాహనాల ధరలను పెంచిన సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం కరోనా  వైరస్   గత సంవత్సరం కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

ఇలాంటి సమయంలో ఫేస్ మస్కూలు, శానిటైజర్ల వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం చాలా ముఖ్యం. ప్రజలు ఏదైనా అత్యవసరమైన పని ఉంటేనే ఇంటి నుండి బయటకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కూడా కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనాలని ఆలోచిస్తున్నారా అయితే తక్కువ ధరతో అధిక మైలేజ్ ఇచ్చే బైకులు ఇండియాలో చాలా ఉన్నాయి. భారత మార్కెట్లో అమ్ముడవుతున్న అతి తక్కువ ధర గల 6 100 సిసి బైక్స్ గురించి తెలుసుకోండి...
హీరో స్ప్లెండర్ ప్లస్హీరో మోటార్ కార్ప్ బైక్ స్ప్లెండర్ ప్లస్ దేశంలో అమ్ముడవుతున్న చౌకైన 100 సిసి బైకులలో గొప్ప ఆప్షన్. ఈ బైక్ 97.2 సిసి ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.01 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ అండ్ కిక్ స్టార్ట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ పాపులర్ బైక్‌ను 4 కలర్ స్కీమ్‌తో కంపెనీ అందిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .62,535.

దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ నుండి వస్తున్న ప్లాటినా 100 తక్కువ బడ్జెట్ లో అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్‌లలో ఒకటి. బజాజ్ ప్లాటినా 102 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.3 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (డే-టైమ్ రన్నింగ్ లైట్స్) కూడా ఈ బైక్‌లో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100 ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 59,859 రూపాయలు.
టీవీఎస్ స్పోర్ట్టీవీఎస్ స్పోర్ట్ 110 సీసీ బైక్. కానీ ఈ బైక్ ధర విషయంలో 100 సిసి విభాగంలోని బైక్‌లతో పోటీపడుతుంది. ఈ బైక్ కిక్-స్టార్ట్, అల్లాయ్ వీల్స్ వేరియంట్ ఢీల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ .56,130. ఈ బైక్‌కి 109.7 సిసి ఇంజన్ వస్తుంది. ఈ ఇంజిన్ 8.29 పిఎస్ శక్తి, 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు లీటరుకు 110.12 కిలోమీటర్ల అత్యధిక మైలేజ్ లభిస్తుందని టీవీఎస్ తెలిపింది.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్హీరో మోటోకార్ప్ చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ చౌకైన 100 సిసి బైక్ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ బైక్ కి 97.2 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8.02 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఐ3ఎస్ టెక్నాలజీ ఉంది, ఈ కారణంగా మైలేజీని 9 శాతం పెంచుతుంది. కంపెనీ దీనిని 5 కలర్ స్కీమ్ లతో విక్రయిస్తుంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ స్పోక్ వీల్ బేస్ వేరియంట్ ఢీల్లీలో ఎక్స్-షోరూమ్ ధర రూ .50,700.
హీరో హెచ్‌ఎఫ్ 100కొత్త ప్రయాణికుల బైక్ హీరో హెచ్‌ఎఫ్ 100 దేశంలోని చౌకైన 100 సిసి బైక్స్ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. సంస్థ ఇటీవల ఈ బైక్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది హీరో కొత్త ఎంట్రీ లెవల్ బైక్‌గా మారింది. హీరో మోటోకార్ప్ చౌకైన బైక్ హెచ్‌ఎఫ్ 100 ఎక్స్-షోరూమ్ ధరను ఢీల్లీలో రూ .49,400 గా నిర్ణయించింది. హీరో హెచ్‌ఎఫ్ 100కి 97.2 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ హెచ్‌ఎఫ్ డీలక్స్‌లో కూడా ఉపయోగించారు. అలాగే దీని ఇంజిన్ లో ఫ్యూయల్ ఇంజెక్ట్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటుంది, ఇది మంచి మైలేజ్ ఇంకా పనితీరును అందిస్తుంది. ఈ ఇంజన్ 8.36 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
బజాజ్ సిటి 100దేశంలో చౌకైన 100 సిసి బైక్స్ లో బజాజ్ సిటి 100 కూడా ఒకటి.ఢీల్లీలో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .49,152. ఈ బైక్ కి 102 సిసి ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ బడ్జెట్ బైక్‌ను మూడు రంగులలో అందిస్తుంది. ఇందులో నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉన్నాయి.

Latest Videos

click me!