ల్యాండ్ రోవర్ లేటెస్ట్ కార్ నడుపుతున్నా ఫెమస్ యోగా గురు..ఇలాంటి కారుని ఎక్కడైనా చూసారా.. వీడియో వైరల్

First Published | Oct 11, 2023, 6:57 PM IST

యోగా గురువు, పతంజలి ఆయుర్వేద ఫౌండర్ బాబా రామ్‌దేవ్ తాజాగా  ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 రైడ్ చేస్తూ కనిపించారు, అయితే అతను కారులో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ SUV అద్భుతమైన సెడోనా రెడ్ పెయింట్ స్కీమ్‌లో  ఉంది ఇంకా ఈ  SUV  ధర దాదాపు రూ. 1.5 కోట్లుగా అంచనా.

రామ్‌దేవ్ ఈ కారు కొన్నాడా అనేది అస్పష్టంగా ఉండగా, అతను డ్రైవర్ సీటులో కూర్చుని కారును డ్రైవ్ చేస్తుండడం చూడొచ్చు. ల్యాండ్ రోవర్  డిఫెండర్ 130 భారతీయ లైనప్‌లో అతిపెద్ద అండ్  అత్యంత ప్రీమియం మోడల్.

ఈ వైరల్ వీడియోలో బాబా రామ్‌దేవ్  కారులో కూర్చోవడానికి ముందు కార్  చెక్ చేయడం చూడవచ్చు. ఈ SUVలో ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు. కొద్దిసేపు తర్వాత రామ్‌దేవ్ కారును రైడ్ చేస్తూ తీసుకెళ్తాడు. వాహనానికి రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేనందున  కొత్త కారుల  కనిపిస్తుంది.
 

సెడోనా రెడ్ కలర్ అప్షన్ డిఫెండర్ 130కి ప్రత్యేకమైనది ఇంకా 110 వేరియంట్‌లో అందుబాటులో లేదు.  ఈ SUV   2023 ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండియాలో ప్రారంభించారు, డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి.

డిఫెండర్ 130 అనేది డిఫెండర్ 110  ఎక్స్టెండెడ్ వెర్షన్, దీనికి కూడా అదే వీల్‌బేస్‌ ఉంటుంది, అయితే  ముందున్న మోడల్  కంటే 340mm ఎక్కువ పొడవు ఉంటుంది, దీనిలో 3  వరుసల సీట్లు ఉంటాయి. 


ఇంకా ఈ SUV ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది, ఇందులో సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

కార్ లోపల ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్ అండ్ మెమరీ ఫంక్షన్‌లతో 14-వే ఎలక్ట్రికల్‌ అడ్జస్ట్  చేయగల ఫ్రంట్ సీట్లు, అలాగే 360-డిగ్రీ కెమెరా ఉంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో  అందరి దృష్టిని ఆకర్షిస్తుండటంతో  బాబా రామ్‌దేవ్ లగ్జరీ డిఫెండర్ 130లో ప్రయాణించడం చాలా మంది ఆటోమోటివ్ ఔత్సాహికులు అండ్ ఫ్యాన్స్ కి ఆసక్తిని రేకెత్తించింది.

Latest Videos

click me!