Winter Tips: మీ దగ్గర CNG కారుందా? ఈ చలికాలంలో ఈ 5 పొరపాట్లు అస్సలు చేయకండి

Published : Nov 27, 2026, 05:45 PM IST

Winter Tips: చలికాలంలో CNG కారును ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఈ ఐదు పొరపాట్లు చేస్తే కారు పనితీరుపై ప్రభావం పడటమే కాకుండా, అనవసర ఖర్చులు కూడా రావచ్చు. అవేంటో తెలుసుకోండి.

PREV
15
చలికాలంలో CNG నింపేటప్పుడు చేయకూడని 5 తప్పులు

కారు ఓనర్లకు వర్షాకాలంలో ఒక ఇబ్బంది అయితే, చలికాలంలో ఇంకో రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు చలికాలం తీవ్రంగా ఉంది. CNG కారు ఉన్నవారికి కష్టాలు మొదలయ్యాయి. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు CNG నింపే సమయంపై ప్రభావం పడుతుంది. మీరు చేసే చిన్న తప్పు కూడా మీ భద్రతను, వాహనం పనితీరును, మీ జేబుకు నష్టాన్ని కలిగిస్తుంది.

మొదటి తప్పు ఏంటంటే, CNG ఇంధనం నింపేటప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం మర్చిపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం లేదా కారులోనే కూర్చోవడం. దీనివల్ల కాటన్ దుస్తులు, సింథటిక్ దుస్తులు చలిలో స్టాటిక్ ఛార్జ్ పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి, ఇంధనం నింపేటప్పుడు ఇంజిన్ పూర్తిగా ఆఫ్ చేసి, మొబైల్ ఫోన్ వాడకండి, కారులోంచి అందరినీ దించేయండి.

25
CNG పూర్తిగా ఖాళీ అయినప్పుడు నింపడం

రెండో తప్పు ఏంటంటే, ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయినప్పుడు లేదా సిఫార్సు చేసిన పరిమితి కంటే ఎక్కువ ప్రెజర్‌తో నింపడం. CNG ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయినప్పుడు దానిలోకి చల్లని గాలి వెళ్తుంది. దీనివల్ల ట్యాంక్ లోపల తేమ పెరగొచ్చు. ఇక ఎక్కువ ప్రెజర్‌తో నింపడం సురక్షితం కాదు. CNG సూచనల ప్రకారం నింపడమే సురక్షితం.

35
CNG గ్యాస్ నింపే ముందు ట్యాంక్ చెక్ చేయకపోవడం

మూడో ముఖ్యమైన తప్పు ఏంటంటే, కారులో CNG గ్యాస్ నింపే ముందు ఎక్కడైనా లీక్ అవుతుందా లేదా రబ్బర్ పైపు సరిగ్గా ఉందా అని చెక్ చేసుకోకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం. ఎందుకంటే చలికాలంలో చలికి రబ్బర్ ప్లాస్టిక్ పైపులు ముడుచుకుపోతాయి. దీని వల్ల గ్యాస్ లీక్ అయితే నష్టం కలుగుతుంది. కాబట్టి CNG నింపే ముందు ట్యాంక్ చెక్ చేసుకోవడం ముఖ్యం.

45
సిలిండర్ వాలిడిటీ, హైడ్రో టెస్ట్ చేయించకపోవడం

సిలిండర్ వాలిడిటీ, హైడ్రో టెస్ట్, నమ్మకమైన పంపును నిర్లక్ష్యం చేయడం. తక్కువ ధరకు దొరుకుతుందని తెలియన పంపుల నుంచి CNG నింపడం. దీనివల్ల కారు మైలేజ్ తగ్గడమే కాకుండా ఇంజిన్ కూడా పాడవుతుంది. ఇది కాకుండా సరైన సమయానికి హైడ్రో టెస్ట్ చేయించకపోతే, చలికాలంలో పెరిగిన ప్రెజర్ వల్ల పాత సిలిండర్లతో ప్రమాదం తప్పదు.

55
కారును నేరుగా CNGలో స్టార్ట్ చేయడం

చివరి తప్పు ఏంటంటే, కారును నేరుగా CNG లో స్టార్ట్ చేయడం లేదా కోల్డ్ ఇంజిన్ వాడి ఒక్కసారిగా యాక్సిలరేట్ చేయడం. ఈ రెండు తప్పులను చాలా మంది చేస్తారు. ఇలా చేయడం తప్పు అని వారికి తెలియదు. చలికాలంలో ఇంజిన్ ఆయిల్ చిక్కబడుతుంది. గ్యాస్ ఆవిరి కావడం కూడా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి, ఎప్పుడూ కారును పెట్రోల్ మీద స్టార్ట్ చేయాలి, కొద్దిసేపట్లో వేడెక్కాక CNG మోడ్‌కి మార్చుకోవాలి.

ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించడం, క్లీన్ ఫిల్టర్, సరైన ఇంధనం నింపే అలవాట్లతో మీ కారు చలికాలంలో కూడా సురక్షితంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల మీకు నష్టం జరగడమే కాకుండా కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories