Best Suspension Bikes: తక్కువ బడ్జెట్‌లో వచ్చే టాప్ 3 USD సస్పెన్షన్ బైక్స్ ఇవిగో!

Published : Nov 27, 2026, 04:05 PM IST

Best Suspension Bikes: గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉండే రోడ్లపై ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ గా వెళ్లాలంటే మంచి సస్పెన్షన్ ఉన్న బైక్ ఉండాల్సిందే. మరి తక్కువ బడ్జెట్‌లో USD సస్పెన్షన్‌తో వచ్చే టాప్ 3 బైక్స్ మీకోసం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

PREV
14
రూ. 2 లక్షలలోపు వచ్చే బెస్ట్ సస్పెన్షన్ బైక్స్

ఒకప్పుడు ఖరీదైన సూపర్ బైక్స్‌లో మాత్రమే ఉండే 'అప్‌సైడ్-డౌన్' (USD) ఫ్రంట్ సస్పెన్షన్ టెక్నాలజీ ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. రూ. 2 లక్షల లోపు బడ్జెట్ బైక్స్‌లో ఈ ఫీచర్ ఇస్తున్నారు. మలుపుల్లో తిప్పేటప్పుడు, సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ బ్యాలెన్స్ తప్పకుండా ఖచ్చితంగా వెళ్లడానికి ఈ USD సస్పెన్షన్ బాగా సహాయపడుతుంది. ఇండియన్ మార్కెట్లో రూ. 2 లక్షల బడ్జెట్‌లో దొరికే టాప్ 3 USD సస్పెన్షన్ బైక్స్ ధరలు, ఇంజిన్ కెపాసిటీ, పవర్, టార్క్, ఇతర ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం.

24
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ

ఇది రోజువారీ ఆఫీస్ అవసరాలకు, వీకెండ్ హైవే రైడ్స్‌కు పర్ఫెక్ట్ స్పోర్టీ బైక్.

ఇంజిన్ & పనితీరు: ఇందులో 197.75 cc సింగిల్-సిలిండర్ ఆయిల్-కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. 5-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ ఉన్న ఈ బైక్ 20.5 PS పవర్‌, 17.25 Nm టార్క్‌ని ఇస్తుంది.

సస్పెన్షన్ & ఫీచర్లు: ముందు వైపు 37 mm USD సస్పెన్షన్ ఇవ్వడంతో గుంతలు, మలుపుల్లో రైడింగ్ చాలా ఈజీగా ఉంటుంది. టాప్ వేరియంట్లలో TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

ధర: USD సస్పెన్షన్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

34
బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

అగ్రెసివ్ స్ట్రీట్‌ఫైటర్ లుక్, స్పీడ్ అంటే ఇష్టపడే కుర్రాళ్ల ఫేవరెట్ మోడల్ ఈ బజాజ్ పల్సర్ NS200.

ఇంజిన్ & పనితీరు: ఇందులో 199.5 cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బండి 24.5 PS పవర్, 18.74 Nm టార్క్ ఇస్తుంది.

సస్పెన్షన్ & ఫీచర్లు: స్ట్రాంగ్ పెరిమీటర్ ఫ్రేమ్‌కి తోడు 37 mm USD ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్ సస్పెన్షన్ అద్భుతమైన బ్యాలెన్స్ ఇస్తాయి. డ్యూయల్-ఛానల్ ABS, TFT డిస్‌ప్లే, రైడింగ్ మోడ్స్, క్విక్-షిఫ్టర్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర: దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 1.38 లక్షల నుంచి మొదలవుతుంది.

44
హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్

అతి పెద్ద ఇంజిన్ ఉన్న పవర్‌ఫుల్ బైక్ హీరో ఎక్స్‌ట్రీమ్ 250R.

ఇంజిన్ & పనితీరు: ఇందులో 249.03 cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ సహాయంతో ఇది ఏకంగా 30 PS పవర్, 25.3 Nm టార్క్‌ని అందిస్తుంది.

సస్పెన్షన్ & ఫీచర్లు: మిగతా రెండు బైక్స్‌లో 37 mm సస్పెన్షన్ ఉంటే, ఇందులో ఏకంగా 43 mm USD ఫ్రంట్ సస్పెన్షన్ ఇవ్వడం దీని స్పెషాలిటీ. పెద్ద 320 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డ్యూయల్-ఛానల్ ABS, కొత్త కార్బన్ వేరియంట్‌లో TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, క్విక్-షిఫ్టర్ లాంటి వరల్డ్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

ధర: దీని నార్మల్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.84 లక్షలు, కార్బన్ మోడల్ ధర రూ. 1.98 లక్షలు.

Read more Photos on
click me!

Recommended Stories