ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చిన చెన్నై కుర్రాడు.. ట్విట్టర్ లో షేర్ చేస్తూ అభినందించిన ఆనంద్ మహీంద్ర..

First Published | Feb 28, 2021, 11:21 AM IST

 ఏదైనా  సమస్యను పరిష్కరించడానికి లేదా కొత్త వాటిని కనుగొనడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారు. ఇందుకు చాలా ఉదాహరణలు మనకు సోషల్ మీడియాలో లేదా నిజ జీవితంలో కనిపిస్తుంటాయి. ఇటీవల ఒక వ్యక్తి తన ఆటోను విలాసవంతమైన ఇంటిగా మార్చాడు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం.. అవును ఈ ఇల్లుని అన్ని సౌకర్యాలతో నిర్మించాడు. ఇది చూసిన మహీంద్రా & మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఆ వ్యక్తి  టాలెంట్ ని అభినందించి అతనితో కలిసి పనిచేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు, ఇందులో ఒక వ్యక్తి తన ఆటోను విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చెన్నైలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు అరుణ్ ప్రభు. అతను తన ఆటోను అన్ని సౌకర్యాలు ఉన్న ఒక విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. ఈ ఇంట్లో విలసమైన స్థలం, వెంటిలేషన్ కూడా ఉంది. దీనికి పైకప్పు, కిటికీలు, తలుపులు, బట్టలు ఎండబెట్టడం వంటి అన్నీ సౌకర్యాలు ఉన్నాయి.
అరుణ్ ఈ ఇంటి పైకప్పుపై సోలార్ సిస్టం కూడా ఏర్పాటు చేశాడు దీనికి కొన్ని బ్యాటరీలను కూడా అందించాడు. వీటి ద్వారా ఈ ఇంటికి విద్యుత్తును సరఫరా అవుతుంది, అది కూడా విద్యుత్ కనెక్షన్ లేకుండా. అరుణ్ నిర్మించిన ఈ మొబైల్ హోమ్‌లో సాధారణ ఇళ్లలో ఉండే ప్రతి సదుపాయాన్ని మీరు చూస్తారు. అంతేకాదు ఈ ఇంట్లో నీటిని నిల్వ చేసే సౌకర్యం కూడా ఉంది.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కరోనా కాలం తరువాత ప్రయాణించడానికి ఇష్టపడే ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అరుణ్ ప్రభు మహీంద్రా బొలెరో వాహనాన్ని కూడా ఇలా చేయగలిగితే నేను సంతోషిస్తానని ట్వీట్ రాశారు. దీనితో పాటు అతనితో కలిసి పనిచేయాలనే కోరికను వ్యక్తం చేస్తూ, తనను అరుణ్‌తో కనెక్ట్ అయ్యేల చేయమని ప్రజలను కోరాడు.
ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్‌లో అరుణ్ ప్రభు ఈ ఇంటిని కేవలం లక్ష రూపాయలకు సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాదు అరుణ్ ఈ ఇంటి పైకప్పుపైన సోలార్ ప్యానల్‌ను కూడా ఏర్పాటు చేశాడు, తద్వారా బ్యాటరీలని ఛార్జ్ చేయడం, ఇంట్లో విద్యుత్తును కూడా అందించవచ్చు. ఇంటికి నీరు అందించడానికి వాటర్ ట్యాంక్ కూడా అమర్చారు అలాగే బట్టలను ఆరబెట్టడానికి హాంగర్లు కూడా ఏర్పాటు చేశాడు.

Latest Videos

click me!