ఇంధన ధరల పెంపుతో కారు కొనలేకపోతున్నారా.. అధిక మైలేజ్ ఇచ్చే ఈ కార్ల గురించి తెలుసుకోండి..

First Published Feb 24, 2021, 6:53 PM IST

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కొద్దిరోజులుగా భారీగా పెరిగాయి. దీంతో పెట్రోల్  ధర కొన్ని రాష్ట్రాల్లో రూ.90కి పైగా, డీజిల్ ధర రూ.85 పైగా చేరాయి. మరోవైపు  పెరుగుతున్న చమురు ధరల ప్రభావం కార్ల అమ్మకాలపై కూడా పడటం ప్రారంభమైంది. అలాగే సి‌ఎన్‌జి ధర కిలోకి రూ .42.71 వద్ద స్థిరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో సి‌ఎన్‌జి కారు కొనడం వల్ల  ప్రయోజనాలు ఎంటో తెలుసుకోండి..
 

సిఎన్‌జి అమర్చిన కార్ల ధర సాధారణ పెట్రోల్ కార్ల కంటే 50 నుంచి 60 వేల రూపాయలు ఎక్కువ. ఆథరైజేడ్ సెంటర్లు మాత్రం 40 వేల రూపాయల వరకు మాత్రమే వసూలు చేస్తాయి. ఒక సిఎన్‌జి కారుతో కిలోమీటరుకు అయ్యే ఖర్చు 2 రూపాయలు. అయితే పెట్రోల్ ధర లీటరుకు 90.58 రూపాయలు అంటే కారు ఖర్చు కిలోమీటరుకు 4 రూపాయలు. మారుతి సుజుకి సంస్థకు చెందిన 14 వాహనాల్లో సిఎన్‌జిని అందిస్తోంది. గత ఏడాది మారుతి 1,06,000 సిఎన్‌జి వాహనాలను విక్రయించగా, 2020-2021లో ఈ సంఖ్య 1,19,000 యూనిట్లకు చేరుకుంది.
undefined
undefined
మారుతి సుజుకి ఆల్టోమారుతి సుజుకి ఎంట్రీ లెవల్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకి ఆల్టో ఒకటి. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది ఒకటి ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో ఎల్‌ఎక్స్ఐ ఇంకా ఎల్‌ఎక్స్ఐ (ఓ). దీని ధర 4.44 లక్షలు నుండి 4.48 లక్షల రూపాయలు ఉంటుంది. ఆల్టో సిఎన్‌జి మైలేజ్ 31.59 కిలోమీటర్లు.
undefined
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోమారుతి సుజుకి సిఎన్‌జి వెర్షన్‌తో మైక్రో ఎస్‌యూవీ బడ్జెట్ కారు ఎస్-ప్రెస్సోను విడుదల చేసింది. మారుతి ఎస్-ప్రెస్సోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. సిఎన్‌జి వేరియంట్‌లలో ఫ్యాక్టరి బిగించిన సిఎన్‌జి కిట్ అందించారు. దీని ఇంజన్ పెట్రోల్ మోడ్‌లో 67 హెచ్‌పి పవర్, 90 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 58 హెచ్‌పి పవర్, 78 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మారుతి ఎస్-ప్రీసో సిఎన్జి మోడల్ కి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే అందించారు. మారుతి ఎస్-ప్రెస్సో ఎస్-సిఎన్‌జిని నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర ఢీల్లీలో రూ .4.89 లక్షల నుంచి రూ .5.19 లక్షలు ఉంటుంది. ఎస్-ప్రెస్సో విఎక్స్ఐ వేరియంట్లలో కూడా సిఎన్జి ఆప్షన్‌ను కంపెనీ ఇచ్చింది. ఎస్-ప్రెస్సో సిఎన్‌జి వెరీఎంట్ 31.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని మారుతి పేర్కొంది.
undefined
మారుతి సుజుకి వాగన్ఆర్ సిఎన్జిమారుతి సుజుకి వాగన్ఆర్ కంపెనీ అత్యంత పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో వాగన్-ఆర్ కూడా అందుబాటులో ఉంది. వాగన్-ఆర్ ధర రూ .5.46 లక్షల నుండి రూ .5.53 లక్షల వరకు ఉంటుంది. వాగన్ఆర్ సిఎన్జి వేరియంట్ 33.54 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్‌తో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఎల్‌ఎక్స్‌ఐ( ఓ) సిఎన్‌జి ధర రూ .5.53 లక్షలు.
undefined
మారుతి సుజుకి సెలెరియోమారుతి సుజుకి సెలెరియో కారు ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జితో విఎక్స్ఐ, విఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. సెలెరియో సిఎన్‌జి మోడల్ ధర రూ .5.73 లక్షల నుంచి రూ .5.78 లక్షలు ఉంటుంది. మారుతి సెలెరియో సిఎన్‌జి వేరియంట్ కిలోకు 31.76 కిమీ మైలేజీని ఇస్తుంది.
undefined
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జిహ్యుందాయ్ మోటార్ కంపెనీ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ 10 నియోస్ 1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 పిఎస్ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో డిజిటల్ స్పీడోమీటర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్జి వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .6.64 లక్షలతో ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సిఎన్‌జి వేరియంట్ 20.7 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
undefined
హ్యుందాయ్ ఆరా సిఎన్‌జిహ్యుందాయ్ ఆరా సెడాన్ కారు గ్రాండ్ ఐ 10 నియోస్ లాగే 1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 69 పిఎస్ శక్తిని, 92 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ రెండు కార్లలో కనిపించే ఫీచర్లు ఒకేలా ఉండవు. హ్యుందాయ్ ఆరా ఎక్స్-షోరూమ్ ధర రూ .7.29 లక్షలు. హ్యుందాయ్ ఆరా సిఎన్‌జి వేరియంట్ కిలోకు 28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
undefined
హ్యుందాయ్ సాంట్రో సిఎన్‌జిహ్యుందాయ్ సాంట్రో సిఎన్‌జిని మాగ్నా, స్పోర్ట్జ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. సిఎన్‌జి మోడల్‌లో డ్యూయల్ ఇసియు ఉంది, ఇది మంచి పనితీరు అందిస్తుంది. ఇందుకు మైక్రో స్విచ్ అందించారు, ఇది ఇంధనాన్ని స్విచ్ చేస్తుంది. సిఎన్‌జి మోడల్ కి కంపెనీ 8 లీటర్ ఇంధన ట్యాంక్‌ను ఇచ్చింది. సాంట్రో సిఎన్‌జి వేరియంట్‌కు 1-లీటర్ ఇంజన్ వస్తుంది, ఇది 60 పిఎస్ శక్తిని, 85 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ జోడించారు. ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈ కారులో సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, రియర్ పార్కింగ్ సెన్సార్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి సాంట్రో 1 కే‌జి సిఎన్‌జికి 30.5 కిలోల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ .5.85 లక్షల నుంచి రూ .7.18 లక్షలు.
undefined
మారుతి సుజుకి ఈకోమారుతి సుజుకి ఈకో కంపెనీకి పాపులర్ వ్యాన్. మారుతి ఈకో తక్కువ ధరకే అధిక మైలేజ్ అందించే వినియోగదారుల బెస్ట్ ఎంపిక. ఈ వ్యాన్ ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్జి వేరియంట్లలో కూడా వస్తుంది. మారుతి ఈకో మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ .3.79 లక్షల నుండి రూ .5.18 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఈకో సిఎన్‌జి మోడల్ 21.94 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
undefined
మారుతి సుజుకి ఎర్టిగా సిఎన్‌జిమారుతి సుజుకి పాపులర్ ఎంపివి (మల్టీ పర్పస్ వెహికల్) ఎర్టిగా ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి ఆప్షన్ తో వస్తుంది. సిఎన్జి ఆప్షన్ ఎర్టిగా సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ కారు ధర రూ .7.69 లక్షల నుంచి రూ .10.47 లక్షల వరకు ఉంటుంది. ఎర్టిగా సిఎన్‌జి 1 కిలోకు 26.08 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
undefined
click me!