అవని లేఖారా సాధించిన చారిత్రక ఘనతకి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తడంతో ప్రముఖ భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఛాంపియన్ అవని లేఖారాకు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర తన ట్వీట్‌లో కంపెనీ "వైకల్యాలున్న వారి కోసం మొట్టమొదటి కస్టమైజ్డ్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ)ని షూటర్ అవనీ లేఖారాకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ట్విట్టర్‌లో ఈ వార్తను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఇటువంటి వాహనం కోసం ఆలోచనను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపా మాలిక్ ఆటోమొబైల్ పరిశ్రమకు అందించారని చెప్పారు. ప్రత్యేక సామర్ధ్యాలు కలిగిన వ్యక్తులకు రోడ్డు ప్రయాణం సౌకర్యవంతమైన, సులభమైన అనుభూతిని అందించడమే ఈ ఎస్‌యూవి ఉద్దేశ్యం.
ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా "ఒక వారం క్రితం దీపా మాలిక్ వికలాంగుల కోసం ఆమె టోక్యోలో ఉపయోగించినట్లుగా ఒక ఎస్‌యూవిని అభివృద్ధి చేయాలని సూచించారు. డెవలప్మెంట్ హెడ్ నా సహోద్యోగి వేలును నేను ఆ సవాలును ఎదుర్కోమని అభ్యర్థించాను. అనుకున్నట్లుగా వేలు అభివృద్ది చేసిన దానిని మొదటగా అవని లేఖారానికి అంకితం చేస్తు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. "అని అన్నారు.
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. అథ్లెట్లకు ఇలాంటి అభినందనలు అవసరమని మరొక ట్విటర్ యూజర్ అన్నారు.ఇంకో వినియోగదారుడు ఇతర కార్పొరేషన్లు కూడా దీనిని అనుసరిస్తాయని, అథ్లెట్లకు రివార్డ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా మాత్రమే కాకుండా తన స్కోరు 249.6 తో కొత్త పారాలింపిక్ రికార్డును నెలకొల్పిన ఘనత కూడా అవని లేఖర సొంతం చేసుకోంది. జైపూర్‌కు చెందిన 19 ఏళ్ల అవనికి 2012లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక్కకి గాయాలయ్యాయి.