KTM 2022 : న్యూ జనరేషన్ కే‌టి‌ఎం ఆర్‌సి 390.. హై పవర్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్లోకి..

First Published | May 24, 2022, 2:31 PM IST

ఆస్ట్రియన్  మోటార్ సైకిల్ కంపెనీ కే‌టి‌ఎం (KTM) కొత్త జనరేషన్ 2022 ఆర్‌సి 390ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఢిల్లీలో కొత్త కే‌టి‌ఎం ఆర్‌సి 390 బైక్‌ను రూ. 3,13,992 ఎక్స్-షోరూమ్ ధరతో  ప్రవేశపెట్టారు.

ఇంజిన్ అండ్ పవర్
2022 ఆర్‌సి 390 373cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్‌లో కొన్ని మార్పులు చేసారు. ఈ ఇంజన్ 43.5 బిహెచ్‌పి పవర్, 37 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా పవర్-అసిస్టెడ్ యాంటీ-హాపింగ్ స్లిప్పర్ క్లచ్‌తో  6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది.


లుక్ అండ్ కలర్ ఆప్షన్స్
2022 కే‌టి‌ఎం ఆర్‌సి 390 కంపెనీ ఇతర మోడల్ ఆర్‌సి 200తో పోలి ఉంటుంది. కొత్త కే‌టి‌ఎం ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ, కే‌టి‌ఎం ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు
కొత్త ఆర్‌సి 390 ఎన్నో కొత్త ఫీచర్లు, ఎక్విప్మెంట్స్ పొందుతుంది:
*13.7 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్
*హైట్ అడ్జస్ట్ హ్యాండిల్‌బార్లు
*ట్రాక్షన్ కంట్రోల్ 
* క్విక్ షిఫ్టర్
*లీన్-యాంగిల్ సెన్సిటివ్ కార్నరింగ్ ఏ‌బి‌ఎస్ 
*సూపర్‌మోటో మోడ్‌తో డ్యూయల్-ఛానల్ ఏ‌బి‌ఎస్ 
*KTM మై రైడ్‌తో TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్


బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్
బైక్ WP అపెక్స్ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్ అండ్ వెనుక వైపున WP అపెక్స్ అడ్జస్టబుల్ మోనో-షాక్ సస్పెన్షన్‌ను పొందుతుంది. బ్రేకింగ్ సెటప్ గురించి చెప్పాలంటే, ముందు భాగంలో 320ఎం‌ఎం, వెనుక 280ఎం‌ఎం డిస్క్ బ్రేక్‌లు ఇచ్చారు.

కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్
బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ (ప్రోబైకింగ్) సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, “KTM RC బైక్ KTM పోర్ట్‌ఫోలియోకు గణనీయమైన ఇంకా పెరుగుతున్న సహకారాన్ని అందిస్తున్నాయి. ఇటువంటి అప్‌గ్రేడ్‌లతో నెక్స్ట్ జనరేషన్ కే‌టి‌ఎం ఆర్‌సి 390 ప్రీమియం పర్ఫర్మెంస్ బైక్స్ సెగ్మెంట్ లో  వృద్ధిని కొనసాగిస్తోంది అని అన్నారు.

Latest Videos

click me!