Ola Electric:కస్టమర్ల కోసం ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఆన్‌లైన్ విండో.. పెరిగిన ధరలు, కొత్త ధర తెలుసుకోండి

First Published | May 23, 2022, 10:56 AM IST

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్(Ola Electric)ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త ఆన్‌లైన్ కొనుగోలు విండోను ప్రారంభించింది. ఈ కొనుగోలు ఏర్పాటును గతంలా ఉంచడంతో పాటు రూ. 500 చెల్లించి రిజర్వేషన్‌ను బుక్ చేసుకున్న  కొనుగోలుదారులు కొనుగోలు విండోలో స్కూటర్‌ను కొనుగోలు చేసే మొదటి అవకాశాన్ని పొందుతారు. అయితే, కొనుగోలు విండో ఎంతకాలం ఓపెన్ ఉంటుందో ఓలా ఎలక్ట్రిక్ పేర్కొనలేదు. 

కొత్త కొనుగోలు విండో తెరవడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1 ప్రో ధరను పెంచినట్లు కూడా తెలిసింది. ఓలా ఎస్1 ప్రో ధరను తాజాగా రూ.10,000 పెంచింది. అయితే, ధరల పెంపునకు సంబంధించి EV తయారీ సంస్థ ఇంకా ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. Ola Electric S1 Pro  కొత్త ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1.40 లక్షలు.

EV తయారీ సంస్థ  ఇ-స్కూటర్ ధరను మొదటిసారిగా పెంచింది. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గతేడాది ఆగస్టు 15న రూ. 1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేశారు. 
 

ఓలా ఎలక్ట్రిక్  కస్టమర్లందరికీ కొత్త కొనుగోలు విండోను ప్రకటించింది, అంటే లాంచ్ తర్వాత మూడవది. ఈ కొనుగోలు విండో వారం మొత్తం ఓపెన్ గా ఉంటుంది. EV సంస్థ ఇప్పటికే ఇండియాలోని ఐదు నగరాల్లో టెస్ట్ రైడ్ క్యాంపులను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న వినియోగదారులందరికీ కంపెనీ ఇమెయిల్ ద్వారా తెలియజేస్తుందని ఓలా తెలిపింది. 
 


డ్రైవింగ్ రేంజ్ అండ్ స్పీడ్ 
Ola S1 వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 121 కి.మీల దూరం ప్రయాణించగలదు. అయితే S1 ప్రో వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జింగ్ తర్వాత 181 కి.మీల దూరం వరకు ప్రయాణించగలదు. S1 వేరియంట్ 3.6 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. అయితే S1 ప్రో వేరియంట్ 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్  టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ. 
 

ఫీచర్లు
S1 అండ్ S1 ప్రో మోడల్స్ రెండూ చాలా ఫీచర్లతో వస్తాయి. స్కూటర్ కీలెస్ అండ్  మొబైల్ ఫోన్ యాప్‌ని ఉపయోగించి స్టార్ట్ చేయవచ్చు. ఇందులో మల్టీ డ్రైవర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో యాప్ అప్‌డేట్‌ల ద్వారా పేరెంట్ కంట్రోల్  అండ్ జియోఫెన్సింగ్ వంటి ఎన్నో ఫీచర్‌లను కంపెనీ మెరుగుపరచవచ్చు. ఈ స్కూటర్‌లో ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి, అంటే మీరు స్కూటర్ దగ్గరికి చేరుకోగానే స్కూటర్ అన్‌లాక్ చేయబడుతుంది. Ola స్కూటర్ GPS ఇంకా కనెక్టివిటీ ఆప్షన్‌లతో బూట్‌ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసే ఆప్షన్‌తో వస్తుంది. 
 

18 నిమిషాల్లో 50% ఛార్జింగ్
ఓలా ఎలక్ట్రిక్  హైపర్‌చార్జర్ కేవలం 18 నిమిషాల్లోనే ఇ-స్కూటర్ బ్యాటరీని 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. అంటే స్కూటర్  బ్యాటరీని తగినంతగా ఛార్జ్ చేస్తుంది, దీంతో 75 కిమీల హాఫ్ సైకిల్  కవర్ చేయగలదు. కంపెనీ వెబ్‌సైట్ ఛార్జర్ ఇన్‌స్టాల్ చేయబడే నగరాల ఫుల్ లిస్ట్ అందిస్తుంది ఇంకా చాలా టైర్ I అండ్ టైర్ II నగరాలు  ఛార్జింగ్ నెట్‌వర్క్ కింద కవర్ చేయబడతాయి. హైపర్‌చార్జర్ స్టేషన్‌లు ఒకే సమయంలో మల్టీ కస్టమర్‌ల స్కూటర్‌లను ఛార్జ్ చేయడానికి మల్టీ లెవెల్ లేఅవుట్‌ను పొందుతాయి. 
 

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ S1 అండ్ S1 ప్రో ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. అయితే ఉత్పత్తిలో కొరత కారణంగా ఓలా ఇప్పటికే S1 ప్రోని మాత్రమే తయారు చేస్తామని ప్రకటించింది.

Latest Videos

click me!