నిస్సాన్ మాగ్నైట్ భారతీయ కార్ల మార్కెట్లో జపాన్ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా అదృష్టాన్ని మార్చివేసింది. లాంచ్‌తోనే ఈ కారు చౌకైన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవిగా వార్తల్లో నిలిచింది. దీనిలోని ఎన్నో ఫీచర్ల కారణంగా ఈ విభాగంలో ఇష్టమైన కారుగా అవతరించింది. నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో రెండు పెట్రోల్ ఇంజిన్లలో అందుబాటులో ఉంది-1.0-లీటర్ అండ్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. దీని 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 70 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ 97bhp శక్తిని, 160 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. మాన్యువల్ పెట్రోల్ ఇంజిన్ 19.42 kmpl మైలేజ్, ఆటోమేటిక్ (CVT)లో లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.59 లక్షలు.