మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. కొందరు.. కొత్త వాళ్లతో అయినా.. ఇట్టే కలిసిపోతారు. మరికొందరు... తెలిసిన వాళ్లతో మాట్లాడటానికి కూడా అంత ఫ్రీగా ఉండలేరు. కేవలం.. తమ ఇంట్లోనే తాము ఉండటానికి ఇష్టపడతారు. ఇతరులతో సమయం గడపడం కంటే.. తమ సొంత కంపెనీని ఇష్టపడతారు. వారు ఇంట్లోనే ఉండాలని అనుకుంటారు. వాళ్ల ఇంట్లోనే ఉంటూ.. టీవీ చూడటం, పుస్తకాలు చదవడం లాంటివి చేయాలని అనుకుంటారు.. వీరినే ఇంట్రావర్టర్స్ అని అంటారు. మరి వారెవరు..? జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశులవారు ఇంట్రావర్టర్సో చెప్పేయవచ్చట.