ఈ డిసెంబర్ నెలలో మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా?

First Published Dec 1, 2021, 11:12 AM IST

రోజు రోజుకీ.. తమ లవ్ లైఫ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లాలి అనుకుంటూ ఉంటారు. మరి ఈ డిసెంబర్ నెలలో.. ఎవరి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..
 

love life

ప్రేమ జీవితం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రోజు రోజుకీ.. తమ లవ్ లైఫ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లాలి అనుకుంటూ ఉంటారు. మరి ఈ డిసెంబర్ నెలలో.. ఎవరి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

1.మేష రాశి...
మేష రాశివారి ప్రేమ జీవితం.. ఈ డిసెంబర్ నెలలో కొంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. కొంత ఆందోళన కలిగించే అవకాశం ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తితో.. మీకు విబేధాలు వచ్చే అవకాశం ఉంది. ఈనెలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. మీ పార్ట్ నర్ తో తేడాలు వచ్చే అవకాశం ఉంది.  తర్వాత.. పశ్చాత్తాప పడే అవకాశం ఉంది.

2.వృషభ రాశి..
ఈ రాశివారు.. తమ భాగస్వామి నుంచి చాలా విషయాలు దాచేస్తారు. ఆ రహస్యాలు.. మీ పని గురించి కావచ్చు.. ఆర్థిక విషయాలు కావచ్చు. లేదంటే... ఏదైనా ఎమోషన్ కి సంబంధించిన విషయం కావచ్చు. కానీ.. అలా దాచిపెట్టడం వల్ల.. భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విశ్వాసం విషయంలో తేడాలు వచ్చేస్తాయి.

3.మిథున రాశి..
ఈ రాశివారికి.. ఈ నెల పెద్దగా కలిసిరాదనే  చెప్పాలి.  ఈ రాశివారికి.. తమ లవ్ లైఫ్ లో.. కొన్ని అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. దాని వల్ల.. పార్ట్ నర్ మీకు తేడాలు వస్తాయి.

4.కర్కాటక రాశి..
ఈ డిసెంబర్ నెల.. కర్కాటక రాశి వారికి ప్రేమ పరంగా  బాగా కలిసి వస్తుంది. ఇప్పుడున్న మీ రిలేషన్ ని.. మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. అది మిమ్మల్ని మరో లెవల్ కి తీసుకువెళ్తుంది.

5.సింహ రాశి..
సింహరాశి వారికి డిసెంబర్ నెల మీ ప్రేమ జీవితంలో చాలా ఒత్తిళ్లను తెస్తుంది. మీ భాగస్వామితో వాగ్వివాదాలు  తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది మీ బంధంలో చికాకు కలిగించవచ్చు. కాబట్టి, మీరు పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

6.కన్య రాశి..
2021 చివరి నెల మీ సంబంధంలో కొంత వృద్ధిని తెస్తుంది. మీరు మీ సంబంధంలో మానసికంగా చాలా పెట్టుబడి పెట్టబోతున్నారు. అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. మీ బంధం చాలా అందంగా మారుతుంది. మీ పార్ట్ నర్ తో ప్రశంసలు అందుకుంటారు.

7.తుల రాశి..
ఈ రాశివారికి తమ ప్రేమ బంధంలో..  ఈ నెల ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. మీ రిలేషన్ ఎలా అయిపోతుందో కూడా మీరు ఊూహించలేరు. అయితే.. అది మంచి కాదు అనే విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.

8.వృశ్చిక రాశి..
ఈ నెల వృశ్చిక రాశివారి లైఫ్ లో ఊహించనిది జరిగే అవకాశం ఉంది. తమ లవ్ లైఫ్ లో ఏది కావాలి అని కోరుకుంటున్నారో.. అది జరుగుతుంది. ఎప్పటి నుంచో.. మీ లవర్ కి.. పెళ్లి ప్రపోజల్ చెప్పాలని అనుకుంటే.. ఆ విషయం కొంచెం ముందుకు వెళుతుంది.

9.ధనస్సు రాశి..
వివాహితులు లేదా ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు డిసెంబర్ నెలలో తమ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటూ ఉంటారు. మీ సంబంధాన్ని మరింత మెరుగు పరుచుకోవడానికి..  మీరు మీ భాగస్వామితో విహారయాత్రలను ప్లాన్ చేస్తారు.

10.మకర రాశి...
ఈ రాశివారికి.. ఈ డిసెంబర్ నెలలో చాలా మార్పులు జరగనున్నాయి. గతంలో ఎప్పుడో తీసుకున్న నిర్ణయాలకు.. ఫలితం ఈ నెలలో దక్కనుంది. గతంలో మీరు చేసిన కొన్ని పనుల కారణంగా.. ఇద్దరి మధ్య విభేదాలు, తేడాలు వచ్చే అకవాశం ఉంది.

11.కుంభ రాశి...
ఈ డిసెంబర్ నెల.. కుంభ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  మీరు మీ పార్ట్ నర్ తో.. ఆనందంగా గడపడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు మీ రిలేషన్  మరో రేంజ్ తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.

12.మీన రాశి...
నెల పొడవునా చాలా మంది వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, వారు ఒక నిర్దిష్ట విషయం చేయడానికి లేదా చెప్పడానికి మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మీనరాశిని జాగ్రత్తగా పాటించాలి, ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి అనుమతించినట్లయితే అది మీ ప్రేమ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

click me!