2.కుంభ రాశి...
కుంభ రాశివారికి 2026లో కాస్త ఎక్కువ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఆర్థికంగా ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఆదాయంలో పెద్దగా గొప్పగా ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఎంత కష్టపడినా... ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు అయితే వచ్చే అవకాశాలు కనపడటం లేదు. పెట్టుబడి, ఆస్తి కొనుగోలు వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు చేస్తే.... ఎక్కువ నష్టాలు వచ్చేస్తాయి.
కుటుంబం, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అలసట, డిప్రెషన్ వంటివి రావచ్చు.
పరిష్కారం... మంచి ప్లానింగ్ తో ముందుకు వెళ్లండి. ఎలాంటి నిర్ణయాలు అయినా ఆలోచించి తీసుకోవాలి.