కొంతమందికి ఒకే సంబంధంలో జీవితాంతం ఉంటారు. వారే లోకంగా బతుకుతారు. కానీ కొంతమంది మాత్రం చాలా తొందరగా విడిపోతారు. మనస్పర్థలు, విభేదాల కారణంగానే విడిపోయామని చెప్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎక్కువ కాలం ఒకే భాగస్వామితో ఉండలేరు. వీళ్లు చాలా తొందరగా భాగస్వామికి బ్రేకప్ చెప్పేస్తారు. వాళ్లు ఎవరెవరంటే?
మేష రాశి
ఈ రాశి వారు స్వభావరీత్యా కొంచెం కోపంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుని అరుస్తుంటారు. వీళ్లు తమ ప్రేమ జీవితం సాఫీగా సాగడం లేదని అనుకున్నప్పుడు నెమ్మదిగా భాగస్వామికి దూరమవుతారు. అలాగే భాగస్వామికి బ్రేకప్ చెప్పేస్తారు.
Image: Pexels
వృశ్చిక రాశి
వీళ్లు రిలేషన్ షిప్ బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఏవైనా గొడవలు, కొట్లాటలు వచ్చినప్పుడు వెంటనే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కానీ పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని భావిస్తే మాత్రం వెంటనే ఆ బంధాన్ని ముగించి బయటకు వెళ్లిపోతారు. అయితే వీళ్లకు తమ భాగస్వామిని మర్చిపోవడానికి చాలా సమయం పడుతుంది.
Libra
తులా రాశి
ఈ రాశి వాళ్లు చిన్న చిన్న విషయాలకు బాధపడుతుంటారు. వీళ్లు తమ భాగస్వామి నుంచి చాలా ఆశిస్తారు. వారు వారి కోరికలకు అనుగుణంగా జీవించకపోతే, వారు తమ భాగస్వామిని విడిచిపెట్టాలని కోరుకుంటారు. అందుకే ఎవరితోనూ ఎక్కువ కాలం రిలేషన్ షిప్ లో ఉండలేకపోతున్నారు.
కుంభం
కుంభ రాశివారు రిలేషన్ షిప్ లో ఇరుక్కోవడానికి అస్సలు ఇష్టపడరు. ఒకవేళ ప్రేమలో పడినా తొందరగగా బ్రేకప్ చెప్పేస్తారు. భాగస్వామి వీళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తేనే వారి బంధం కొనసాగుతుంది.