telugu astrology
16-4-2024, మంగళవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)
మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు
భరణి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత
కృత్తిక నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.
దిన ఫలం:-వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.రావలసిన బాకీలు చేతికి అందక ఇబ్బందులు పడతారు.బంధుమిత్రుల సహకారంతో తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండగలవు. ఆర్థిక ఒప్పందాలు లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.వ్యవహారములలో పెద్దల సహకారం లభిస్తుంది.ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.
మృగశిర నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.
దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు రాగలవు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.బంధు మిత్రులతో అకారణంగా విభేదాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చేసే పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు.మానసిక భయాందోళన.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.
పునర్వసు నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.
దిన ఫలం:-అనవసరమైన వివాదాలు రావచ్చు.ఖర్చుల నియంత్రణ అవసరం.శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విరోధాలు రాగలవు. ఉద్యోగ సంబంధిత విషయాలు లో ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం.సమాజంలో జరిగిన సంఘటన వలన మానసిక ఉద్రేకం చెందుతారు.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి జన్మతార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
ఆశ్రేష నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.
దిన ఫలం:-అనవసరమైన విషయాల యందు దూరంగా ఉండటం మంచిది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ సత్తా తెలుస్తుందిఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు.బంధు మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు.చేసే పనులలో శ్రమాధికంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేస్తారు.సమస్యలు ను కుటుంబ సభ్యులు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.
దిన ఫలం:-చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అగును.వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు.ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పెద్దల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగాలలో బాధ్యత సమర్థంగా నిర్వర్తిస్తారు.వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు.సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.ఓం శ్రీకృష్ణాయ నమః నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది.
చిత్త నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.
దిన ఫలం:-సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారాల్లో ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీలు లో జాగ్రత్త అవసరం.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
తుల (చిత్త 3 4 స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.
విశాఖ నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.
దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహంలో అనుకూలమైన వాతావరణం.కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి కాగలవు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఓం ధాన్యలక్ష్మి యై నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
జ్యేష్ట నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.
దిన ఫలం:-తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అవును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఆర్థికంగా బాగుంటుంది.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఓం సౌభాగ్య లక్ష్మీ యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభాలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. పనులు పూర్తి కాగలవు
పూ.షాఢ నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) చేపట్టిన పనులలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పని ఒత్తిడి పెరుగుతాయి.
ఉ.షాఢ నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి.
దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.నూతన ఆదాయ మార్గాలను అన్వేషణ చేస్తారు.ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.సహోద్యోగుల సహాయ సహకారాలు లభించును.నూతన వస్త్రాభరణం కొనుగోలు చేస్తారు.ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మకరం (ఉ.షాడ శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురవగలవు. వివాదాలకు కలహాలకు దూరంగా ఉండాలి.
ధనిష్ఠ నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన వ్యవహారాలు పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు.
దిన ఫలం:-ప్రయాణాలు కలిసి వస్తాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలించును.నూతన వస్త్రాభరణాలు వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారములు సంతృప్తికరంగా ఉంటాయి.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.సంసార జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.ఓం కీర్తిలక్ష్మీయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4 శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) ముఖ్యమైన పనుల లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు రాగలవు.
పూ.భాద్ర నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు.
దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.విద్యార్థులకు అనుకూలం.ఆర్థికంగా బాగుంటుంది.బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు లో సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఉద్యోగాలు లో అధికారుల ఆదర అభిమానం పొందగలరు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ఉద్యోగాలలో అధికారులు తో చిన్నపాటి వివాదాలు రాగలవు. వివాదాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
రేవతి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తలచిన కార్యాలు లో అవాంతరాలు కలుగును. ఇంటా బయట గందరగోళ పరిస్థితి.
దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారులు తో మిత్రత్వం ఏర్పడును .ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఆర్థికంగా ఇబ్బందులు రాగలవు.కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు.మానసిక అశాంతి. గృహంలో చికాకుగా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.వృధా ప్రయాణాలు.వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)