Zodiac sign: నిరుద్యోగుల రాత మార‌నుంది.. 2026లో ఈ 5 రాశుల వారికి ఉద్యోగం రావ‌డం ఖాయం

Published : Dec 31, 2025, 05:54 PM IST

Zodiac sign: కొత్తేడాదిలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. జ్యోతిష్య ప‌రంగా ఉద్యోగానికి ప్రధానంగా దశమ స్థానం, దశమాధిపతి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అంశాల ఆధారంగా చూస్తే కొన్ని రాశుల వారికి ఉద్యోగ రంగంలో స్పష్టమైన శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. 

PREV
15
వృషభ రాశి: కొత్త ఉద్యోగం ఖాయం

వృషభ రాశి వారికి 2026 ప్రారంభంలోనే ఉద్యోగం లభించే సూచనలు బలంగా ఉన్నాయి. దశమ స్థానంలో రాహువు ప్రభావం ఉండగా దశమాధిపతి శని లాభ స్థానంలో బలంగా సంచారం చేస్తాడు. దీని వల్ల నిరుద్యోగులకు త్వరగా ఆఫర్లు వస్తాయి. సొంత ప్రాంతంలో ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది. మంచి కంపెనీకి మారాలనుకునేవారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.

25
మిథున రాశి: జనవరి తర్వాత శుభవార్తలు

మిథున రాశి వారికి 2026 జనవరి మధ్య నుంచి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దశమ స్థానంలో శని ప్రభావం ఉండగా దశమాధిపతి గురువు అనుకూలంగా ఉన్నాడు. దీని వల్ల నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.

35
కర్కాటక రాశి: కొద్దిపాటి ప్రయత్నంతో ఫలితం

కర్కాటక రాశి వారికి దశమాధిపతి కుజుడు 2026లో బలంగా మారనున్నాడు. దీని వల్ల మార్చి లోపే ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కల నెరవేరే సమయం దగ్గరలో ఉంది. ఇంటర్వ్యూలు బాగా సాగుతాయి. దూర ప్రాంతాల్లో పని చేసే అవకాశం కనిపిస్తుంది. విదేశీ ఆఫర్లు కూడా కొందరికి అందవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు మార్పుల వైపు వెళ్లే అవకాశం మాత్రం తక్కువగా ఉంటుంది.

45
తుల రాశి: విదేశీ అవకాశాలు బలంగా

తుల రాశి వారికి 2026లో కెరీర్ పరంగా పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. జూన్ నుంచి గురువు దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలోకి రావడంతో విదేశీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మార్చి నుంచి విదేశీ ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పటికే విదేశాల్లో పని చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలోకి మారాలనుకునేవారికి కూడా అనుకూల కాలం ఇది.

55
మకరం, మీన రాశులు: జీతభత్యాలు పెరిగే అవకాశాలు

మకరం రాశి వారికి 2026లో మంచి జీతంతో కూడిన ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. దశమాధిపతి శుక్రుడు అనుకూలంగా మారడం వల్ల ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు రావచ్చు. కెరీర్‌లో ఊహించని ఎదుగుదల కనిపిస్తుంది.

మీన రాశి వారికి జూన్ స‌మ‌యంలో ఉద్యోగం దక్కే సూచనలు ఉన్నాయి. గురువు ప్రభావంతో విదేశీ అవకాశాలు బలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే శుభవార్తలు తప్పకుండా వస్తాయి.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు ఇంట‌ర్నెట్‌లో అందుబాటులో ఉన్న స‌మాచారం, ప‌లువురు పండితులు తెలిపిన విష‌యాల ఆధారంగా అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Read more Photos on
click me!

Recommended Stories