2024 Rasi Phalalu:ఏ రాశివారికి కలిసొస్తోంది, ఎవరు నష్టపోతారు,ఎవరి జాతకం ఎలా ఉండబోతోంది..!

First Published | Dec 30, 2023, 11:23 AM IST

మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ నూతన సంవత్సరంలో జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఎలా ఉంటుంది..?ఎవరికి బాగా కలిసొస్తుందో.. ఎవరికి నష్టాలు కలిగిస్తుందో ఓసారి చూద్దాం..

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ సంవత్సర రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 
 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. గతంలో కొనుగోలుచేసిన భూములకు విలువ పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ లభిస్తుంది. సివిల్ సర్వీసులకు ఎంపికవుతారు. ఉద్యోగప్రయత్నాలు అనుకూలం. చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ ఆదాయంలో అభివృద్ధి కనిపించే అవకాశం ఉంది లేదా మార్చి  నెలలో మీరు ప్రమోషన్ పొందవచ్చు. మీరు వ్యాపారం చేస్తున్నటైతే ఈ సమయంలో ఒక ఆలోచనాత్మకమైన నిర్ణయాలను తీసుకోవాలి లేకపోతె ఆర్థిక పరంగా నష్టపోతారు.  మీరుఈ సంవత్సరం మార్చి - జులై నెలలలో వివాహ కార్యకలాపాలు చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రేమ పరంగా అనుకున్న ఫలితాలు దక్కక పోవచ్చును . వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. రాజకీయ పదవులు లభిస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. తోలు ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు, జల రవాణా లాభసాటిగా ఉంటాయి. దైవానుగ్రహంతో వివాహ శుభకార్యాలు సఫలమవుతాయి. ఈ సంవత్సరంలో మీ కుటుంబ పరిధిలో ఒక వివాహ వేడుక జరుగుతుంది. డబ్బును ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మీరు డబ్బును పెట్టుబడి పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి. సంవత్సర ప్రారంభంలో మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచన. అలాగే గ్రహాల శుభ దృష్టి వల్ల  మీకు వృత్తి పరంగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది.  అవివాహితులకు ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది. ఎవరినైనా ఇష్టపడుతుంటే, మీ ప్రేమను వ్యక్తపరచాలి అని అనుకుంటే మీ అభిప్రాయం తెలియజేయడానికి ఈ సంవత్సరం చాలా అనుకూలం.
 


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో

ఈ రాశివారికి  సాంకేతిక వ్యాపారాలు, వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇతరుల మీద ద్వేషం మీపై అభిమానంగా మారి కొందరు సహకరిస్తారు. గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహరాల్లో పెద్దలు అనుకూలంగా వ్యవహరిస్తారు. స్పెక్యులేషన్, సెల్ఫ్ డిఫెన్స్ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తాయి. లైసెన్సులు, లీజులు లాభిస్తాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు ఉపకరిస్తాయి. జీవితభాగస్వామితో సఖ్యత చాలా విషయాల్లో ప్రభావితం చేస్తుంది. రాజకీ పదవులు లభిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఈ సంవత్సరం అంతటా మీ కెరీర్ పట్ల తీవ్రంగా కృషి చేస్తారు. దానికోసం మీరు మీ కెరీర్లో మీకంటూ ఒక ఒక ప్రత్యేకతను సృష్టించుకోవడానికి కూడా కృషి చేస్తారు.ఆర్ధిక జీవితం సాధారణం కంటే మెరుగైనదిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోకపోతే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు.  ఈ కాలంలో ఇంటిని కూడా మరమత్తులు చేయించవచ్చును. ఈ సమయంలో ఆస్తులను కొనడం కానీ అమ్మడంకాని చేస్తారు. ఈ రాశి వారికి 2024 సంవత్సరం మొత్తం పెద్దగా ఆరోగ్య పరంగా ఏ విధమైన సమస్య ఉండదు. ఏప్రిల్-మే మరియు ఆగస్టు నెలలలో కొంత ముందు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఈ సంవత్సరంలో వృత్తి పరమైన జీవితంలో గొప్ప ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో మీ ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. జనవరి నెలలో విజయాల కోసం ఎక్కువ కృషి చేయవలిసి ఉంటుంది. దీనితో మీకు జనవరి-ఫిబ్రవరి నెలలలో ఆకస్మిక ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో మీ జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

 చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయాలు ఈ సంవత్సరంలో పెరగవచ్చు.మీకు నూతన ఆదాయ మార్గాలు సృష్టించబడతాయి.ఏప్రిల్ మధ్య నుండి మే మధ్య వరకు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది అలాగే జూన్ అంతటా కొనసాగుతుంది. విదేశీయాన సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ధనం అధికంగా వెచ్చిస్తారు. సంతానం, కుటుంబసభ్యుల మాటను కాదనలేక ఆర్ధిక భారం మోస్తారు. సామాజిక, రాజకీయ మార్పులు మంచి ప్రభావం చూపుతాయి. గతంలో కష్టానికి ఫలితం ఉంటుంది. మాటపట్టింపు వల్ల కొన్నింటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వంశపారంపర్యంగా ఆస్తులు సానుకూలమవుతాయి. క్రీడలు, రాజకీయాలపై అంచనాలు నిజమవుతాయి. విద్యా, వైజ్ఞానిక రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కవులు, కళాకారులకు కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతంమాత్రంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవంత్సరం వారి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అని అనుకుంటారో వారు మరియు పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికీ అనుకూల ఫలితాలను ఇస్తాయి. పోటీ పరీక్షలకు మీ ఈ కృషి మరియు అదృష్టం రెండు కలిసివస్తాయి. ఈ సంవత్సరం మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా పెళ్లి అయినా లేదా ఒక నూతన శిశువు జన్మించడం కానీ జరుగుతుంది. మీరు మీ కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

  ఈ రాశివారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలమవుతాయి. స్నేహితులు, బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. రహస్య ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయాల్లో అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వస్తాయి. విదేశాల నుంచి ఆర్ధిక సాయం అందుతాయి. వంశ వృద్ధి జరుగుతుంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉందని గ్రహిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  అయితే మీరు మార్చి మరియు జూన్ నెల్లలో డబ్బు మరియు భవిషత్తు విషయాలలో కొంచం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సంవత్సరం విజయాలను సాదించాలి అంటే అది మీ కృషి మీదే ఆధారపడి ఉంటుంది. మీ కుటుంబ జీవితం మెరుగు పడుతుంది. జీవిత భాగస్వామి ,కుటుంబ సభ్యలు మీకు అన్ని విధాలుగా మద్దతును తెలియజేస్తారు.  మీ భాగస్వామి,మీరు ఒకరి మీద ఒకరు ప్రతీ విషయంలోనూ పట్టుదలతో కలిసి ఉంటారు. కొత్తగా వివాహం అయిన వారు సంతానం కోసం ఆశించవచ్చును. అవివాహితులు భాగస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుయితే మీరు మీ భాగస్వామిని పొందగలుగుతారు. ఎక్కువ కాలం మీరు మీ భాగస్వామితో అందమైన బంధాన్ని పొందుతారు.

telugu astrology


 
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధ అంశాలు, విదేశీ యానాలు అనుకూలిస్తాయి. కొత్త విధానాలను అవలంభిస్తారు. ఇది మీ భవిషత్తుకి మరియు సంపదకు అవరోధాలను కలిగిస్తుంది.  ఈ సంవత్సరంలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మార్చి మరియు మే నెలలలో కొంచం ఎక్కువ శ్రద్ద పెట్టవలిసి ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు ఒక మోస్తరులో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వాహనాలతో జాగ్రత్త అవసరం.  చాలా సార్లు అదృష్టం కూడా కలిసిరాదు.  అలాగే ఈ సంవత్సరం మీరు ఉద్యోగం సంపాదించడానికి మరింత కృషి చేయవలిసి ఉంటుంది. మీ సీనియర్లు, అధికారుల నుండి సహకారాన్ని పొందుతారు కాని మీరు వారి సలహాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు. భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలను పరిష్కరించుకుంటారు. జలవనరులు ఆశించినచోట ఏర్పడతాయి. విదేశాల్లోని వ్యక్తుల వల్ల పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. అవివాహితులకు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. నమ్మినవారు ద్రోహం చేస్తారు. ఆశించిన ఫలితాలును పొందుతారు. ఆర్ధిక పరిస్థితిలో మార్పు వస్తుంది. శుభకార్యాలలో ఇబ్బందులు ఎదురువుతారు. స్టేషనరీ, ప్రింటింగ్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పోరాటానికి సంకల్పం చేసే పరిస్థితి ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉంటారు. విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా జనవరి నెలలో  శనిచేత ప్రయోజనం పొందుతారు. ఈ సంవత్సరం సింహరాశి వారి కుటుంబ జీవితం అంత అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం మధ్య కాలంలో ఇంట్లో ఒక మంగళ కరమైన కార్యాన్ని చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

telugu astrology


 
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు 
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ, ఆర్థిక పురోగతి ఉంటుంది. జులై - ఆగష్టు నెలల్లో మీరు విదేశీ వనరుల నుండి ఆదాయాన్ని పొందవచ్చును, అదే సమయంలో మీ ఖర్చుల ఫలితంగా మీరు మీ ఆదాయాన్ని కోల్పోవచ్చును. ఆ తరువాత ఉన్న ఆరు నెలలు మీకు మీ ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తులు అమ్మి మరో వ్యాపారాల్లో పెటుబడులు పెడతారు. కొన్ని విషయాల్లో న్యాయపోరాటాలకు సిద్ధపడతారు. కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. రాజకీయ జీవితం బాగుంటుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్యుల పనితీరును కనిపెడతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నమ్మికమైన వారిని సేవకులుగా నియమించుకుంటారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండాలి. వృత్తి పరమైన, వ్యాపారం, విద్య మరియు వివాహం వంటి రంగాలలో మీరు అనుకున్న ఫలితాలను పొందవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో   చాలా ఖర్చు చేస్తారు. అయితే మీకు డబ్బులు అనేవి వస్తు,పోతూ వుంటాయి. మీరు ఏ విధమైన పెట్టుబడులు పెట్టడానికైనా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో చక్కని ఆరోగ్యం కలిగి వుంటారు. అన్నివిధాలుగా ఈ సంవత్సరం మీ ఆరోగ్య పరిస్థితి బాగా వుంటుంది. ఫిబ్రవరి నెలలో ఎక్కువగా ఖర్చు చేస్తారు. ప్రమోషన్స్ వస్తాయి. మీ సీనియర్ మరియు సహ ఉద్యోగుల నుండి మద్దతు పొందవచ్చు లేదా అధికారిక ఉద్యోగోములో పెరుగుదల పొందవచ్చు. ఉద్యోగ విషయంలో  మీకు అదృష్టం సంవత్సరం మొత్తం తోడుగా ఉంటుంది.

telugu astrology


 
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు
 (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ఈ రాశివారికి ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. సానుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు గడిస్తారు. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. స్థలాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభను నిరూపించుకుంటారు. ఉద్యోగాల్లో స్థానచలం సూచనలు ఉంటాయి. సామాజిక, సేవా సంస్థలకు సాయం చేస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. శత్రువుల నుంచి ఏర్పడిన ఇబ్బందులను అధిగమించగలుగుతారు. మానసిక స్థైర్యం పెరుగుతుంది. మార్చిలో భూమి కానీ వాహనం కానీ కొనవచ్చు. ఈ సమయంలో మీ కుటుంబంలోకి ఒక కొత్త శిశువు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవంత్సరం తుల రాశి వారు ఏవరైతే వారికి నచ్చిన వారిని వివాహం చేసుకుందాం అనుకొంటారో వారికి ఈ సంవత్సరం మధ్యభాగం నుండి అనుకూలంగా ఉంటుంది.  కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. సంతాన భాగ్యం దక్కుతుంది. కొన్ని విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల మేలు జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపుచేయడంలో విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతి పనుల్లోనూ వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని ఓడిస్తారు. వ్యాపార సంబంధ విషయాల్లో పురోగతి సాగిస్తారు. విద్యా సంబంధ విషయాలు సానుకూలంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు
 (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

 ఈ సంవత్సరం చాలావరకూ  శుభదాయకం. అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి.    అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. అయితే వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధన లాభముంటుంది. మార్చి మధ్యమనం నుండి వత్స రాంతం వరకు   స్థాన చలన సూచనలుంటాయి. శుభకార్యాలకు ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యాలు ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ఇతరుల ఇబ్బందిని కలుగ జేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. సెప్టెంబర్ నుంచి ప్రయత్న కార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబంతో సంతోషం గా వుంటారు. ముఖ్యమైన పని పూర్తి కావడంతో ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. దైవదర్శనం లభిస్తుంది.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

మీకు జాతక రీత్యా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధం వ్యవహారాలు లాభిస్తాయి. అరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబ విషయాల ప్రభావం వృత్తి, వ్యాపారాలపై పడుతుంది. ఆత్మ విశ్వాసం, అభిమానంతో ఉంటారు. శత్రువులు మిత్రులవుతారు. వ్యతిరేక వర్గానికి సాయం చేస్తారు. లౌక్యంలోపించడం, స్వతంత్ర భావాలు వల్ల చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. దైవానుగ్రహం వల్ల ఆపదల నుంచి బయటపడతారు. లీజు, లైసెన్సులు, టెండర్లు అనుకూలిస్తాయి. బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంస్థ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం అనుకూలిస్తాయి. ఒప్పందాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి.  అయితే మీరు మీ పని ప్రదేశాలలో ప్రశంసలు పొందుతారు. మీ సహోఉద్యోగులు కూడా మీకు సహాయం చేస్తాను మరియు లాభదాయకమైన ఆలోచనలను చెప్తారు. ఈ సంవత్సరం మీ ఆదాయం నికరంగా వుంటుంది. మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ విద్యకు సంబంధించిన విషయాలలో ఈ సంవత్సరం మీ దీర్ఘకాల కోరిక నెరవేరవచ్చు. మీరు ఈ సమయంలో ఎలక్ట్రానిక్ లేదా హార్డ్వేర్ వ్యాపారాలు చేస్తున్నట్లైతే మీరు మరింత విజయాన్ని పొందతారు .
 
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

ఈ రాశివారికి జనవరి 25 నుంచి అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తుల వల్ల కొంత నష్టం జరుగుతుంది.  ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం సానుకూలంగా ఉండదు. మీరు ఈ సంవత్సరం ప్రారంభంలో భూమి కానీ వాహనం కానీ కొనవచ్చు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మొదటి కొన్ని నెలల్లో మరియు తరువాత జూన్ తరువాత పిల్లలను ఆశించవచ్చు.నమ్ముకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోవిధంగా ఉపయోగపడరు. ఆత్మీయులు కొన్ని సందర్భాల్లో అపార్థం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పరపతి పెరుగుతుంది. మొండిబాకీల వ్యవహారాలు మలుపు తిరుగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయానం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయంలోనూ అంచనాలు నిజమవుతాయి. బ్యాంకు రుణాలు తీరుస్తారు. ఈ సంవత్సరంలో మీ ప్రేమ జీవితం మీకు అనుకూల పరిస్థితులను అందించదు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లు ఐతే వారు మిమ్మల్ని సంవత్సరం చివరిలో ప్రేమించే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయాలను అనుభవం ఉన్నవారితో చర్చించండి. మీరు ఈ సంవత్సరంలో కడుపుకు సంబందించిన బాధలు పడే అవకాశం,అలాగే  మీరు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. సాధ్యమైన మేరకు ఆహార నియమాలు పాటించండి. ఈ సంవత్సరం మధ్యలో వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని కోసం మీరు ఆయా రంగలలోని నిపుణులైన వారిని సంప్రదించి నిర్ణయాలను తీసుకోండి. 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

ఈ సంవత్సరం మీరు వ్యాపారాల్లో లాభపడతారు. అమ్మకాలు, కొనుగోలు లాభసాటిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత పురోగతి ఉంటుంది. సంతాన పురోగతికి డబ్బులు అధికంగా ఖర్చుచేస్తారు. సహోదర వర్గం ప్రేమ వివాహాలు చికాకు కల్గిస్తాయి. బాధ్యతలు నుంచి తప్పుకుంటారు. మహిళల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. స్నేహితులతో కలిసి వ్యాపారాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తు గురించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవ కార్యక్రమాలు, దీక్షలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాప్యంగా జరుగుతుంది. చేసిన ప్రతిపాదనలకు విదేశాల్లో ఆమోదం లభిస్తుంది. ఆకస్మిక ధనం చేతికందుతుంది. పెట్టుబడుల వల్ల లాభపడతారు. ఆలస్యంగా మంచి జరుగుతుంది. ఆర్థిక మరియు వ్యాపారం వంటి రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి. మీ ఆర్థిక స్థితికి సంబంధించినంత వరకు ఈ సంవత్సరం బాగుంది. మీరు మీజీతంలో అభివృద్ధిని పొందవచ్చు లేదా మీ సామర్థ్యం వల్ల అదనపు డబ్బు సంపాదించవచ్చు. ఈ సంవత్సరం మీకు ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఈ సంవత్సరం  మీ జాతకం శత్రువులపై విజయం సాధించే  సంకేతాలను చూపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం మీ పిల్లలకు చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చును, వారు వృత్తి పరంగా ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం సంతాన సాఫల్యత కుడా ఉంది.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)

 ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహసంబంధ విషయాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకొనే అవకాశం వుంటుంది. మీకు ఈ సంవత్సరం అధిక ఆదాయం మీ బాండ్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల ద్వారా పొందవచ్చు. ఈ సంవత్సరం మొదటి నెలలో అనగా జనవరి నెలలో మీ ఆరోగ్యం అంతగా సహకరించక పోవచ్చు. ఫిబ్రవరిలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్దగా వుండాలి. ఇంతకు మించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మీకు కలగవు.  అయితే వృత్తి పరంగా కొన్ని ప్రాజెక్టుల్లో ఇబ్బందులు ఎదురువుతాయి. అంతరాత్మకు విరుద్ధంగా వ్యవహరిస్తారు. దొంగ స్వామీజీల పట్ల అభిప్రాయాలను అందరికీ చెప్తారు. వ్యక్తిగత విషయాలను స్వయంగా చూసుకుంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. సంతోష సమయాలను కొన్ని సందర్భాల్లో ఆస్వాదించలేరు. రాజకీయ పదవులు దక్కుతాయి. సంతాన ప్రాప్తి ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు, ఇతరత్ర విషయాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులు దూరమవుతారు. . మీ చదువు, భవిషత్తు మరియు పెళ్లి వంటి విషయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.  అలాగే ఈ రాశివారికి చాలా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మాట నెగ్గించుకుంటారు. ప్రతి విషయంలోనూ సహోదరులు, పెద్దలు అండగా నిలుస్తారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.

Latest Videos

click me!