న్యూ ఇయర్ రోజు ఈ వస్తువులను దానం చేయండి.. ఏడాది మొత్తం సంతోషంగా ఉంటారు

Published : Dec 30, 2023, 09:43 AM IST

New Year 2024: కొత్త సంవత్సరానికి ఇంకా ఎన్ని రోజులు లేదు. అయితే జ్యోతిష్యం ప్రకారం.. ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు రాశుల ప్రకారం.. కొన్ని వస్తువులను దానం చేస్తే వారు ఏడాది మొత్తం సంతోషంగా ఉంటారు.   

PREV
17
న్యూ ఇయర్ రోజు ఈ వస్తువులను దానం చేయండి.. ఏడాది మొత్తం సంతోషంగా ఉంటారు

2023 కు బాయ్ బాయ్ చెప్పేసి, 2024 కు వెల్ కం చెప్పేసే టైం వచ్చింది. అయితే హిందూ మతంలో కొత్త సంవత్సరం మొదటి రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు సోమవారం వస్తుంది. ఈ వారం శివుడికి అంకితం చేయబడింది. అందుకే ఈ రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కొత్త సంవత్సరం మొదటి రోజు శివుడిని పూజించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయనే నమ్మకం ఉంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఈ రోజు మీ రాశిచక్రం ప్రకారం వస్తువులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మరి ఏ రాశి వారు ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

27
Aries

మేషరాశి 

మేష రాశి వారు కొత్త సంవత్సరంలో శివాలయానికి వెళ్లాలి. శివుడికి బటాషే సమర్పించిన తర్వాత వాటిని దానం చేయాలి. ఈ దానం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.

వృషభ రాశి 

వృషభ రాశి జాతకులు న్యూ ఇయర్ మొదటిరోజు డజను అరటిపండ్లను దానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. అలాగే దీనివల్ల మీరు కొత్తసంవత్సంరంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. 
 

37
Gemini daily horoscope

మిథున రాశి 

కొత్త సంవత్సరం మొదటి రోజున మిథున రాశివారు ఆవుకు గడ్డి లేదా బచ్చలికూరను తినిపించాలి. ఇది మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. అలాగే మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. 

కర్కాటక రాశి 

కొత్త సంవత్సరం మొదటి రోజున కర్కాటక రాశి వారు గుప్పెడు పిండితీసుకుని వాటిని గుళికలను తయారు చేసి నదిలో పోసి చేపలకు ఆహారంగా వేయాలి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది.
 

47
Leo daily rashifal


సింహ రాశి 

కొత్త సంవత్సరం మొదటి రోజు సింహరాశి వారు ఎర్రని పండ్లను దానం చేయాలి. దానిమ్మ వంటి పండ్లను. ఈ దానం సంతోషం, శ్రేయస్సును కాపాడుతుంది.

కన్యా రాశి 

న్యూ ఇయర్ ఫస్ట్ డే నాదు కన్యారాశి వారు పావు మీటరు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకుని మీ ఇష్టదేవుని ఆలయానికి వెళ్లి సమర్పించి పూజించండి. ఇది ఇంట్లో పురోగతి, సంతోషాన్ని తెస్తుంది.
 

57
Libra and Aquarius

తులా రాశి 

తులారాశి వారికి తెల్ల ధాన్యాలను దానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది గృహ దోషాన్ని వదిలిస్తుంది. అలాగే మీ కోరికలన్నీ నెరవేరడానికి సహాయపడుతుంది. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు పసుపు రంగు వస్తువులను కొత్త సంవత్సరం మొదటిరోజు దానం చేయాలి. ఇది సంతోషం, శ్రేయస్సును కలిగిస్తుంది. 
 

67
Sagittarius

ధనుస్సు రాశి 

ధనుస్సు రాశి జాతకులు కొత్త సంవత్సరం మొదటిరోజు తీపి పదార్థాలను దానం చేస్తారు. ఇది ఒక వ్యక్తి జీవితంలో సానుకూలతను నింపుతుంది.

మకర రాశి 

మకర రాశి వారు నూతన సంవత్సరం మొదటి రోజున ఏ ఆలయానికైనా వెళ్లి కర్పూరం ప్యాకెట్ దానం చేయాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. 

77
Daily Aquarius Horoscope

కుంభ రాశి 

కుంభ రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజున పాలను దానం చేయాలి. ఇది ఒక వ్యక్తి జీవితంలో శుభప్రదంగా ఉంటుంది.

మీన రాశి 

కొత్త సంవత్సరం మొదటి రోజున మీన రాశి వారు హనుమంతుని ఆలయానికి వెళ్లి మోతీచూర్ లడ్డూలను దానం చేయాలి. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories