Mole Astrology: శరీరంపై అక్కడ పుట్టుమచ్చలున్న స్త్రీలు జీవితంలో విపరీతంగా డబ్బు సంపాదిస్తారు

Published : Feb 02, 2026, 10:21 AM IST

Mole Astrology: సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ శరీరంలో కొన్ని ప్రదేశాల్లో ఉండే పుట్టుమచ్చలు వారిని అదృష్టవంతులను చేస్తాయి. ధనానికి లోటు లేకుండా చేస్తాయి. ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే అదృష్టవంతులు అవుతారో తెలుసుకోండి. 

PREV
14
పుట్టుమచ్చల శాస్త్రం ఏం చెబుతోంది

సాముద్రిక శాస్త్రం అనేది ఒక వ్యక్తి శరీర నిర్మాణం, ఆ శరీర రంగు, శరీరం పై ఉన్న గుర్తులు ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును ముందే అంచనా వేసి చెబుతుంది. వాటిలో పుట్టుమచ్చలు కూడా ఒకటి. ముఖ్యంగా స్త్రీ శరీరంలోని కొన్ని భాగాలపై ఉండే పుట్టుమచ్చలు వారిని అదృష్టవంతులను చేస్తాయి. వారిని లక్ష్మీదేవి రూపాలుగా మారుస్తాయి. ఆ స్త్రీ అడుగుపెట్టిన చోట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే సంపద అదృష్టానికి సంకేతమో తెలుసుకోండి.

24
నుదుటి మధ్యలో

సాముద్రిక శాస్త్రం చెబుతున్న ప్రకారం నుదుటి మధ్యలో లేదా నుదుటికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అదృష్టవంతురాలవుతుంది. ఆమె ఆత్మ విశ్వాసంతో ముందుకెళుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతుంది. ఎప్పుడూ వీరికి డబ్బు కష్టాలే రావు. వారున్న కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఆ కుటుంబంలో వీరే లక్ష్మీదేవి స్వరూపాలుగా చెప్పుకోవచ్చు.

ముక్కు కొనపై పుట్టుమచ్చ

ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే కాస్త మొండిగా ఉంటారు. కానీ ఆర్థికంగా మాత్రం రాజయోగాలు దక్కుతాయి. ముక్కు చివర పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా చిన్న ప్రయత్నంతోనే గొప్ప విజయాలను సాధిస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతికి డబ్బులు అందుతాయి.

34
గడ్డం మీద పుట్టుమచ్చ

గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్న మహిళ ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా బలంగా ఉంటుంది. అలాంటి స్త్రీలు ప్రశాంతంగా ఉంటారు. వారు డబ్బును సరిగ్గా మేనేజ్ చేయగలరు. తమ కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తారు. వారు ఉండే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.

నడుము మీద

నడుము మీద పుట్టుమచ్చ ఉండే స్త్రీ కచ్చితంగా ధనవంతురాలు అవుతుంది. ఆ స్త్రీలు జీవితంలో అన్ని రకాల సౌకర్యాలను అనుభవిస్తారు. నడుము మీద పుట్టుమచ్చ వున్న స్త్రీలు తమ భర్తలకు, వారి కుటుంబాలకు అదృష్టాన్ని తెచ్చి పెడతారు.

44
అరచేతి లోపల

అరచేతి లోపల మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే అది సంపదకు కీలకమైన సంకేతంగా చెప్పుకోవచ్చు. అలాంటి స్త్రీలు కచ్చితంగా ధనవంతులవుతారు. వీరికి బలమైన ఆర్థిక నేపథ్యం కూడా ఉంటుంది. వారు సహజంగానే ఇతరులకు సహాయం కూడా చేస్తూ ఉంటారు.

అరికాళ్ళపై పుట్టుమచ్చ

అరికాళ్లపై పుట్టుమచ్చ ఉంటే అది రాజయోగాన్ని సూచిస్తుంది. అలాంటి స్త్రీలు తరచుగా విదేశాలకు వెళ్లి వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నత చదువులు ఉన్నత పదవులు పొందుతారు. వారి అదృష్టం వారి కుటుంబానికి కూడా సిద్ధిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories