Mangala Yogam: మంగళయోగంతో ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేదు, మట్టి ముట్టినా బంగారమే

Published : Oct 21, 2025, 10:09 AM IST

దీపావళి తర్వాత శక్తింతమైన మంగళ యోెగం ఏర్పడుతుంది.  గురు, శుక్ర, బుధ, కుజ గ్రహాల సంచారంలో మార్పు వల్ల ఈ యోగం ఏర్పడింది. దీనివల్ల మూడు రాశుల వారికి (Zodiac Signs) విపరీత ధనయోగం ఏర్పడుతుంది. 

PREV
15
మంగళ యోగం

దీపావళి తరువాత గురు, శుక్ర, బుధ, కుజ గ్రహాలు మంచి స్థానాల్లోకి మారాయి. దీంతో శక్తివంతమైన మంగళ యోగం ఏర్పడింది. ఈ యోగం  వల్ల అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ యోగం ఆర్ధికపరంగా కలిసొచ్చేలా చేస్తుంది.

25
మంగళ యోగం అంటే?

జ్యోతిషశాస్త్రంలో  మంగళ యోగం  అంటే కుజుడు మంచి స్థితిలో ఉండి, గురువు లేదా శుక్రుడితో కలిస్తే ఏర్పడే ఒక ప్రత్యేక యోగం. ఇప్పుడు ఏర్పడిన మంగళయోగం వల్ల మూడు రావుల వారికి విపరీతంగా కలిసిరాబోతోంది. ఆ మూడు రాశులు ఎవరో తెలుసుకోండి.

35
మేష రాశి

 కుజుడు మీ లగ్నంలో ఉండి గురువుతో కలవడం వల్ల బలమైన మంగళ యోగం ఏర్పడింది.  ఆగిపోయిన పనులు వేగవంతమై విజయం సాధిస్తాయి. ఉద్యోగంలో ఎన్నో మంచి అవకాశాలు దొరుకుతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలను పొందుతారు. ప్రభుత్వ పనుల్లోని అడ్డంకులు తొలగిపోతాయి.

45
సింహ రాశి

సింహ రాశి వారికి గురువు మీ లాభ స్థానంలో ఉంటాడు. అక్కడ శుక్రుడు పంచమంలో కలుస్తాడు. ఇది మంగళ యోగాన్ని ఏర్పరుస్తుంది . మీకు రాజులాంటి గౌరవం దక్కుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నత బాధ్యతలు దక్కుతాయి.  జీతం పెరుగుతుంది. ఇల్లు కొనడం, వాహన యోగం వంటివి కూడ ఉన్నాయి. 

55
ధనుస్సు రాశి

మంగళ యోగం ధనుస్సు రాశి వారికి సంపదను, కీర్తిని అందిస్తుంది. గురువు మద్దుతు మీకుంటుంది. కుజుడు ఉచ్ఛస్థానంలో ఉండటం వల్ల పెద్ద పురోగతిని ఇస్తుంది. మీ అప్పులు తీరుతాయి. వ్యాపారంలో ముందుకు సాగుతారు. పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories