Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమించినవారినే మోసం చేస్తారు.

Published : May 14, 2025, 01:36 PM IST

కట్టుకున్న వారిని మోసం చేసి.. మరొకరితో జీవితం గడుపుతారు. ఈ మధ్యకాలంలో అలాంటివారు చాలా ఎక్కువైపోయారు. అయితే,  పుట్టిన తేదీని బట్టి, మీ  జీవితంలోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా? 

PREV
14
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమించినవారినే మోసం చేస్తారు.

మానవ జీవితంలో బంధానికి ఎక్కువ విలువ ఉంటుంది. మన జీవితం ఆనందంగా సాగాలంటే.. మన చుట్టూ ఉన్నవారితో బంధం, అనుబంధం కూడా సాఫీగా ఉండాలి. ముఖ్యంగా వైవాహిక జీవితం సరిగా ఉంటేనే జీవితం బాగుంటుంది. చాలా మంది తాము కట్టుకున్నవారికి కట్టుబడి ఉంటారు. వారికి ఎక్కువ విలువ ఇస్తారు. కానీ, కొందరు అలా కాదు. నమ్మించి మోసం చేస్తారు. కట్టుకున్న వారిని మోసం చేసి.. మరొకరితో జీవితం గడుపుతారు. ఈ మధ్యకాలంలో అలాంటివారు చాలా ఎక్కువైపోయారు. అయితే,  పుట్టిన తేదీని బట్టి, మీ  జీవితంలోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. న్యూమరాలజీ ప్రకారం అది తెలుసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారు తమ భాగస్వామి ని ఘోరంగా మోసం చేసే అవకాశం ఉంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..

24

మోసం చేయడంలో దిట్ట..

మీరు ఏ నెలలో అయినా 5,7,9, 14, 16, 23, 27 తేదీల్లో జన్మించిన వారు  సాధారణంగా చాలా సెల్ఫిష్ గా ఉంటారు.  వీరు ఏ విషయంలో అయినా తమ స్వలాభాన్ని చూసుకుంటారు. వారు ఎప్పటికప్పుడు కొత్త అనుభవాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే బంధానికి విలువ ఇవ్వకుండా, స్వీయ ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ భాగస్వామిని పట్టించుకోకుండా మోసం చేయడానికి ఏ మాత్రం వెనకాడరు. మరో రిలేషన్ పెట్టుకోవడానికి కూడా వీరు అస్సలు వెనకాడరు.
 

34

నమ్మకానికి మారుపేరు..

మరోవైపు న్యూమరాలజీ ప్రకారం ఏదైనా నెలలో 2, 4,6, 11, 17, 29, 24 తేదీల్లో పుట్టిన వారు మాత్రం చాలా భిన్నంగా ఉంటారు. వీరు నమ్మకానికి మారుపేరుగా నిలుస్తారు. తమ బంధాలపై అత్యంత నిబద్దత కనపరుస్తారు. కుటుంబం, స్నేహితులు, తమ భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కలలో కూడా మోసం చేయాలని అనుకోరు. బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు.

44

ఫైనల్ గా..
సంఖ్యాశాస్త్రం మన జీవనయానంలో ఒక్క కోణాన్ని చూపించే పరిమితి మాత్రమే. నిజమైన బంధం అనేది ఎప్పుడూ పరస్పర విశ్వాసం, స్పష్టమైన సంభాషణ, అంకితభావంతోనే స్థిరపడుతుంది. న్యూమరాలజీ మనకు కొన్ని సూచనలు ఇవ్వొచ్చు. కానీ మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories