Astrology: పక్కవారి చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది.?

Published : Mar 06, 2025, 03:32 PM ISTUpdated : Mar 07, 2025, 06:47 PM IST

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలను స్పష్టంగా ప్రస్తావించారు. మనకు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల ఎదుర్కొనే ఇబ్బందుల గురించి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. అలాంటి ఒక నియమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
15
Astrology: పక్కవారి చెప్పులు వేసుకుంటే ఏమవుతుంది.?
Astrology

ఇతరుల వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం. వీటిలో ప్రధానంగా దుస్తులు, చెప్పులు కూడా ఉంటాయి. అయితే ఇతరుల చెప్పులను ధరించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పక్కవారి చెప్పులను ధరించడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇంతకీ పక్కవారి చెప్పులను ధరిస్తే జరిగే నష్టం ఏంటి.? శాస్త్రం ఏం చెబుతోంది.? సైన్స్‌ ఏం చెబుతోంది ఇప్పుడు చూద్దాం. 

25

చెప్పుల్లో వాటిని ధరించే వారి ఎనర్జీ ఉంటుందని చెబుతుంటారు. అందకే ఒకరి చెప్పులను మరొకరు ధరిస్తే వారి కర్మ ఫలితాలు ధరించిన వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చెడు శక్తుల ప్రభావం ఉన్న వారి చెప్పులను ధరిస్తే ఆ ప్రభావం మనపై కూడా పడుతుందని అంటున్నారు. జ్యోతిష్యం ప్రకారం, ఇతరుల చెప్పులు ధరించడం ఆర్థిక నష్టాన్ని, కష్టాలను, అప్పులను పెంచుతుందని చెబుతారు. ఇక చెప్పులు పోవడాన్ని రాహు, శని దోషానికి సూచన అని అంటుంటారు. 
 

35

ప్రతీ వ్యక్తికి ఒక కర్మ ఫలం ఉంటుందని, ఇతరుల చెప్పులు వాడితే ఆ వ్యక్తి కర్మ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. దీనివల్ల అపజయాలు, ఆరోగ్య సమస్యలు, ప్రతికూల మార్పులు  వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం పాదాలు శక్తిని గ్రహించే కీలక భాగంగా చెబుతుంటారు. ఇతరుల చెప్పులు వాడితే, రాహు, శని గ్రహాల ప్రభావం పెరిగి శారీరక, మానసిక సమస్యలు తలెత్తవచ్చని చెబుతుంటారు. 
 

45

అలాగే ఇతరుల చెప్పులు ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, దీంతో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు పెరిగే అవకాశం ఉంది. పొరపాటున కూడా ఎవరి చెప్పులూ వాడకూడదని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ వాడాల్సి వస్తే చెప్పులను బాగా శుభ్రపరిచి ఆ తర్వాత ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద ఇతరుల చెప్పులు వాడటం దరిద్ర యోగం, నెగటివ్ ఎనర్జీ, అనారోగ్య సమస్యలు తీసుకొస్తుందని పండితులు చెబుతుంటారు. 
 

55

సైన్స్ ఏం చెబుతోంది.? 

సైన్స్‌ ప్రకారం కూడా ఇతరుల చెప్పులు వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారికి ఉండే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు  వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సంక్రమించవచ్చు. కొంతమంది పాదాల్లో ఎక్కువగా చెమట పడటంతో, బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మళ్లీ వాడితే మీకు కూడా అదే సమస్య వస్తుంది. ఒక్కొక్కరి పాదాల ఆకృతి ఒక్కోలా ఉంటుంది. దీంతో చెప్పుల ఆకారం కూడా కొంతమేర మారుతుంది. ఇతరుల ఇతరుల చెప్పులు వాడటం వల్ల పాదాలకు అసౌకర్యంగా ఉండి నొప్పి, గాయాలు వచ్చే అవకాశం ఉంది. 
 

click me!

Recommended Stories