మంగళ, శనివారాల్లో హెయిర్ కట్ ఎందుకు చేయించుకోరు?

First Published | May 21, 2024, 4:04 PM IST

మంగళ, శనివారాల్లో జుట్టును కట్ చేసుకోరు అన్న సంగతి ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ ఎందుకు కట్ చేయరు అన్న ముచ్చట మాత్రం చాలా మందికి తెలియదు. అసలు ఎందుకు ఈ వారాల్లో జుట్టును కట్ చేసుకోరంటే? 
 

మన ధార్మిక గ్రంధాలలో ఎన్నో విషయాల గురించి ప్రస్తావించబడ్డాయి. అలాగే వీటిని చాలా మంది పాటిస్తారు కూడా. శాస్త్రాలు చెప్పిన విధంగా నడుచుకుంటే జీవితం ఆనందంగా సాగుతుందని నమ్ముతారు.  అలాగే వీటిని పాటించకపోవడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని పెద్దలు చెప్తుంటారు. అదే గ్రంధాలలో.. జుట్టును కట్ చేయడానికి కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వీటిలో మంగళ, శనివారాలలో హెయిర్ ను కట్ చేయించుకోకూడదని చెప్పబడింది. 

ఒకవేళ మీరు మంగళ, శనివారాల్లో జుట్టును కట్ చేయించుకుంటే మీరు మీ జీవితంలో ఊహించని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే ఇది ఆర్థిక నష్టాలనికి దారితీస్తుందని నమ్ముతారు. మంగళ, శనివారాలను హనుమంతుడు, శనిదేవుని రోజుగా భావిస్తారు.ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు హెయిర్ కట్ చేస్తే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 


జ్యోతిష్యుల ప్రకారం.. వారంలోని ప్రతిఒక్క రోజు ఏదో ఒక దేవుడు, దేవతలకు , గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. మీరు జుట్టు లేదా గోర్లను కట్ చేసే  జ్యోతిష సంప్రదాయాలను అనుసరిస్తే, అది మీ జీవిత ఆర్థిక పరిస్థితులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 

వారంలోని ప్రతి ఒక్క రోజు గురించి మాట్లాడితే.. ఆదివారం సూర్యుడికి, సోమవారం శివచంద్రులకు, మంగళవారం హనుమంతుడు, కుజుడు, బుధవారం కృష్ణుడు, బుధుడు, గురువారం విష్ణువు, లక్ష్మీదేవి, బృహస్పతి, శుక్ర, శనివారాలు సంతోషి దేవికి, శుక్రుడు, శని భగవంతునికి అంకితం చేయబడ్డారు. ఈ గ్రహాల ప్రభావం ప్రతిరోజూ ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ముఖ్యమైనదే. అలాగే మనం చేసే పనులను బట్టే ఫలితాలు ఉంటాయి. 
 

మంగళవారం నాడు జుట్టును ఎందుకు కట్ చేయకూడదు?

జ్యోతిషశాస్త్రంలో మంగళవారం కుజుడు పుట్టిన రోజుగా భావిస్తారు. అంటే ఏ శుభకార్యానికైనా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అయితే మన జుట్టు శనితో సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మీరు మంగళవారం నాడు జుట్టును కట్ చేస్తే మీరు లైఫ్ లో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

హిందూ మతం ప్రకారం.. ఎవరైనా మంగళవారం నాడు హెయిర్ ను కట్ చేస్తే మీరు జీవితంలో ఎన్నో అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అంతే కాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే మంగళవారం నాడు జుట్టును, గోర్లను కట్ చేయకూడదని అంటుంటారు. 
 

hair cutting

శనివారం నాడు ఎందుకు జుట్టును కట్ చేయకూడదు? 

శనివారం నాడు జుట్టును కట్ చేస్తే శనీశ్వరుడికి కోపం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. నిజానికి  మూలాలు తక్కువగా ఉన్న పురాతన కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వైదిక జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శని అని కూడా పిలువబడే శని గ్రహం ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ పురాణాలలో.. శని అత్యంత శక్తివంతమైన దేవతలు కూడా భయపడే కోపం స్వభావం కలిగిన గ్రహంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రోజుల్లో జుట్టును, గోర్లను కట్ చేయకూడదని చెప్తారు.

Latest Videos

click me!