Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు

First Published Mar 7, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. కుటుంబ వృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో అధికారులు తో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. 
 

7-3-2024, గురువారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి(విపత్తార)తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త అవసరం.ఆలోచించి ఖర్చు చేయవలెను.

భరణి నక్షత్రం వారికి(సంపత్తార) బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

కృత్తిక నక్షత్రం వారికి(జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులు తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.సన్నిహిత సహాయ సహకారాలు లభిస్తాయి.ఉద్యోగులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార ఆలోచనలు చేస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.ఓం శ్రీనివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
రోహిణి నక్షత్రం వారికి(పరమైత్రతార)ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.పనులలో ఆటంకాలు. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు.ఖర్చులు ఆలోచించి చేయవలెను.

మృగశిర నక్షత్రం వారికి(మిత్ర తార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఉద్యోగాలు లో అధికారుల గౌరవం లభించును. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలు లో పాల్గొంటారు.ఓం త్రిపురసుందర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
ఆరుద్ర నక్షత్రం వారికి(నైధనతార)మానసిక ఆందోళన.పనులలో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి.సమాజంలో అపవాదము రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి (సాధన తార)మానసిక ఆనందం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు.గౌరవ మర్యాదలు పొందగలరు.వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-కుటుంబ వృద్ధి కొరకు ఆలోచన చేస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఉద్యోగాలలో అధికారులు తో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండాలి.కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలుగవు.ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పుష్యమి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.బంధుమిత్రులతో అకారణ కలహాలు రాగలవు.వస్తువులు జాగ్రత్త.

ఆశ్రేష నక్షత్రం వారికి(క్షేమతార) వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అధికారులు ఆదరణ పొందగలరు. ధనలాభం.

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బంది కలగవచ్చు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.నూతన పరిచయాలు.చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో మనస్పర్థలు రావచ్చు.ఉద్యోగస్తులకు అధికారుల మూలంగా చికాకులు. అనవసరమైన ఖర్చులు.ప్రభుత్వ సంబంధించిన పనులు ముందుకు సాగక మానసిక ఆందోళన కలుగును.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాగలవు.సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి(విపత్తార)తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త అవసరం.ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి(సంపత్తార) బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులు తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలు లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.అవసరాల మేరకు ఖర్చు చేస్తారు.సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు.బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలం.ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు.ఓం మహావీరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాబలం
హస్త నక్షత్రం వారికి(పరమ మిత్ర తార)ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు.ఖర్చులు ఆలోచించి చేయవలెను.

చిత్త నక్షత్రం వారికి(మిత్ర తార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగ్గట్టు గా ధనం లభిస్తుంది.విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన బాకీలు వసూలగును.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.అన్ని వర్గాల వారు విజయావకాశాలు పొందుతారు.అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు.కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ప్రయాణాలు అనుకూలిస్తాయి.ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (నైధనతార)మానసిక ఆందోళన.పనులలో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి.సమాజంలో అపవాదము రాగలవు.

విశాఖ నక్షత్రం వారికి(సాధన తార)మానసిక ఆనందం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-వ్యవహారాలు మందగిస్తాయి.ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది.కుటుంబసభ్యులతో  వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త అవసరం.పనులు వాయిదా పడతాయి.ఆలోచనలు ఏవి కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.వ్యాపారాలు మందకొడిగా సాగును.ఉద్యోగస్తులు తోటివారితో సంయమనంతో మెలగాలి.ఊహించని ఖర్చులు కుటుంబ అవసరాలు పెరుగుతాయి.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి(ప్రత్యక్తార) ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.బంధుమిత్రులతో అకారణ కలహాలు రాగలవు.వస్తువులు జాగ్రత్త.

జ్యేష్ట నక్షత్రం వారికి(క్షేమతార)వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అధికారులు ఆదరణ పొందగలరు.ధనలాభం.

దిన ఫలం:-నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.సంతానం మరియు వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేయు వ్యవహారంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కి సంబంధించిన వార్త వింటారు. శుభవార్త గృహంలో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహం పరుస్తాయి.ఓం నమో నారాయణాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి(విపత్తార)తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త అవసరం.ఆలోచించి ఖర్చు చేయవలెను.

పూ.షాఢ నక్షత్రం వారికి(సంపత్తార) బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వ్యాపార అభివృద్ధి ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం.తలపెట్టిన పనులు పూర్తగును.

ఉ.షాఢ నక్షత్రం వారికి(జన్మతార)అనవసరమైన ప్రయాణాలు.పనులలో ఆటంకాలు. అధికారులు తో అకారణ కలహాలు.అనవసరమైన ఖర్చులు.

దిన ఫలం:-చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.శారీరక కష్టం పెరుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు.సంఘంలో తెలివిగా వ్యవహరించాలి.ఉద్యోగాలు లో అధికారులు ఒత్తిడులు పెరుగుతాయి.మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి.సమాజంలో సంభాషించేటప్పుడు సంయమనం పాటించాలి.వృథా ఖర్చులు నియంత్రించాలి.బంధువర్గంతో మనస్పర్థలు రావచ్చు.ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మకర (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
శ్రవణా నక్షత్రం వారికి(పరమ మిత్ర తార) ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులలో ఆటంకాలు. ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు.ఖర్చులు ఆలోచించి చేయవలెను.

ధనిష్ఠ నక్షత్రం వారికి(మిత్ర తార)నూతన పరిచయాలు.వృత్తి వ్యాపారాలలో ధనలాభం.శుభవార్తలు వింటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

దిన ఫలం:-కుటుంబంలో శుభ కార్యాచరణ.ఉద్యోగులకు అనుకూలం.పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ వృద్ధికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.తలపెట్టిన కార్యములు సకాలంలో పూర్తవుతాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం.బుద్ధిబలం బాగుంటుంది. సమయానుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి(నైధనతార)మానసిక ఆందోళన.పనులలో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి.సమాజంలో అపవాదము రాగలవు.

పూ.భాద్ర నక్షత్రం వారికి(సాధన తార)మానసిక ఆనందం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. గౌరవ మర్యాదలు పొందగలరు. వ్యాపారంలో ధన లాభం.

దిన ఫలం:-సంఘంలో గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.అనుకున్న పనులు సజావుగా జరుగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపారాల్లో ధనలాభం పొందుతారు.ఆనందంగా గడుపుతారు.ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భాద్ర నక్షత్రం వారికి(ప్రత్యక్తార) ఉద్యోగాలలో అధికారులు తో సఖ్యత గా మెలగాలి.బంధుమిత్రులతో అకారణ కలహాలు రాగలవు.వస్తువులు జాగ్రత్త.

రేవతి నక్షత్రం వారికి(క్షేమతార) వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.అధికారులు ఆదరణ పొందగలరు. ధనలాభం.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.సంతానంతో మనస్పర్థలు రాగలవు.  వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం.ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది.అనుకున్న పనులు లో అవరోధాలు.బాధ్యత మరింత పెరుగుతుంది. ఉద్యోగాలు లో గందరగోళ పరిస్థితి.చెప్పుడు మాటలు వినడం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి.ఓం గణపతియే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

click me!