నెంబర్ 8...
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 8 కిందకు వస్తారు.ఈ తేదీల్లో పుట్టిన వారంతా శని ప్రభావంతో ఉంటారు. వీరు మీ జీవితంలోకి రావడం ఒక పెద్ద పాఠం లాంటిది. క్రమశిక్షణ, బాధ్యత , కష్టపడటం అంటే ఏంటో వీరు మీకు నేర్పిస్తారు. కొన్నిసార్లు వీరి వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు, కానీ ఆ ఇబ్బంది మిమ్మల్ని జీవితంలో మరింత స్ట్రాంగ్‌గా మార్చడానికి ఉపయోగపడుతుంది.
నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు మీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దు. ఎందుకంటే, వీరు మీ లక్ష్యాన్ని గుర్తు చేయడంలో ముందుంటారు. మీరు మీ లక్ష్యాలను మర్చిపోయి సోమరిగా ఉన్నప్పుడు వీరు మీ జీవితంలోకి వస్తారు. మీలో కసిని, పట్టుదలను పెంచడానికి వీరు ప్రేరణగా నిలుస్తారు. ఏదైనా సాధించాలనే తపనను వీరు మీలో కలిగిస్తారు.
ఏ వ్యక్తి కూడా కారణం లేకుండా మనల్ని కలవరు. కొందరు మనకు సంతోషాన్ని ఇవ్వడానికి వస్తే, మరికొందరు మనల్ని మనం దిద్దుకోవడానికి పాఠాలు నేర్పడానికి వస్తారు. "మనుషులు మారవచ్చు కానీ, వారు మనకు నేర్పిన పాఠం , వారు మన జీవితంలోకి వచ్చిన ఉద్దేశ్యం ఎప్పటికీ గుర్తిండిపోతాయి."