White Cat: తెల్లపిల్లి ఎదురైతే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ల పంట పండినట్టేనా?

Published : Apr 25, 2026, 04:55 PM IST

పిల్లి ఎదురైతే అశుభమని అంతా భావిస్తుంటారు. మరి అదే తెల్ల పిల్లి ఎదురైతే ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఒక అదిరిపోయే వార్త తెలిసింది.   

PREV
14
పిల్లి సెంటిమెంట్‌

సాధారణంగా మన నమ్మకాల ప్రకారం, పెద్దలు చెప్పేదాన్ని ప్రకారం, ఆస్ట్రాలజీ లెక్కల ప్రకారం పిల్లి ఎదురైతే అశుభమని చెబుతుంటారు. మనం ఎక్కడికైనా వెళ్లే ముందు దారికి అడ్డంగా పిల్లి వస్తే, మనం చేసే పనికి ఆటంకానికి చిహ్నంగా చెబుతుంటారు. చాలా వరకు ఆ పనులను వాయిదా వేసుకుంటారు. కొన్నిసార్లు పిల్లినే తిట్టుకుంటారు. కానీ పిల్లుల్లో రకరకాలుంటాయి. రంగులు కూడా ఉంటాయి. నార్మల్‌గా కలర్‌లో మనం రెగ్యూలర్‌గా చూస్తుంటాం. అడపాదడపా నల్లగా ఉండే పిల్లులను చూస్తుంటాం. కొన్ని తెల్లగా కూడా ఉంటాయి.

24
తెల్ల పిల్లి ఎదురు పడితే శుభమా అశుభమా?

మరి మనకు తెల్లపిల్లి ఎదురైతే దాని ఫలితం ఏంటి? శాస్త్రం ఏం చెబుతుంది? పెద్దలు ఏం చెబుతున్నారనేది చూస్తే.  తెల్లపిల్లిని పాజిటివ్‌ ఎనర్జీకి చిహ్నంగా చెబుతుంటారు. అదృష్టానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. ఇది మంచి జరుగుతుందని సూచనగా నమ్ముతారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో తెల్ల పిల్లులు కాంతికి వాహకాలుగా, హాని నుండి రక్షించేవిగా పరిగణించబడతాయి. ఇంట్లో తెల్ల పిల్లి ఉండటం సానుకూల శక్తిని (Positive Energy) తీసుకువస్తుందని, ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు.

34
తెల్ల పిల్లి ఎదురైతే జరిగేది ఇదే

ఇందులో నిజమెంతా? నిజంగానే తెల్లపిల్లి ఎదురైతే మంచి జరుగుతుందా? అనేది తెలుసుకుంటే అందులో వాస్తవం లేదని అంటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్‌ కుమార్‌ గారు. పిల్లి ఏదైనా పిల్లినే అని, అది నెగటివ్‌ ఎనర్జీకి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మనం ఒక పనిమీద ఎక్కడికైనా వెళ్లినప్పుడు మన దారికి అడ్డంగా పిల్లి వెళితే అది అశుభమని, వెళ్లే పనిలో ఆటంకాలకు ఆస్కారం ఉందనే సంకేతాలనిస్తుందని చెప్పారు. ఆ పని విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కుదిరితే తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో తెల్లపిల్లి ఎదురైనా, ఇదే నియమం వర్తిస్తుందని వెల్లడించారు.

44
పిల్లి ఇలా ఎదురైతే డేంజర్‌

మామూలుగా పిల్లి కనిపిస్తే అది ఎలాంటి నెగటివ్‌ ఎనర్జీ కాదని, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం దారిలో వెళ్తుంటే ఎదురైతేనే మనం ఆలోచించుకోవాలని చెప్పారు. ఇదిలా ఉంటే పిల్లి (ఏ రంగుదైనా) దారి దాటడం అశుభమని, ముఖ్యంగా ఎడమ నుండి కుడికి వెళ్తే అశుభమని, కుడి నుండి ఎడమకు వెళ్తే శుభమని కూడా కొన్ని ఆస్ట్రాలజీకి సంబంధించిన నమ్మకాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం నమ్మకాలుగానే మనం పరిగణించాలి. ఇదే నిజమనే చెప్పాడానికి సైంటిఫిక్‌ ఆధారాలేవి లేవు. కేవలం అది కొన్నేళ్లుగా వస్తున్న నమ్మకం మాత్రమే అని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories