వెండి ఉంగరాలు ధరించడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నారు. కొందరేమో.. బంగారం కొనలేక వెండి ధరిస్తున్నారు. కానీ, వెండి అందరూ ధరించకూడదట. జోతిష్యశాస్త్రం ప్రకారం కొందరికి మాత్రం వెండి లాభాలు తీసుకురాదట. నష్టాలు తెచ్చి పెడుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
చేతికి బంగారం ఉంగరమే కాదు, చాలా మంది వెండి ఉంగరం కూడా ధరిస్తూ ఉంటారు. ఈ వెండి ఉంగరాలు చేతికి చాలా స్టైలిష్ గా కూడా కనపడతాయి. అయితే అందం మాత్రమే కాదు, మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంలోనూ వెండి ముందు వరసలో ఉంటుంది. వెండి చంద్రుడితో ముడిపడి ఉంటుంది.అందుకే జోతిష్యశాస్త్రం ప్రకారం వెండి ధరించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని రాశులవారు పొరపాటున కూడా వెండి ధరించకూడదట. మరి, ఏ రాశివారు ధరించాలి? ఎవరు ధరించకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
27
telugu astrology
కర్కాటక రాశి..
కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తాడు. ఈ రాశికి వెండితో అనుబంధం చాలా ఎక్కువ.అందుకే ఈ రాశివారు వెండి ఉంగరం ధరించడం అదృష్టం.అంతేకాదు.. వెండి ఉంగరం ధరించడం వల్ల ఈ రాశివారికి మనశ్శాంతిగా ఉంటుంది. మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అవి తగ్గిపోతాయి. మనసు సంతోషంగా ఉంటుంది.
37
telugu astrology
వృషభ రాశి..
వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. సాధారణంగా ఈ రాశివారికి బంగారం బాగా అదృష్టాన్ని తెస్తుంది. అయితే, బంగారంతో పాటు, వెండి కూడా ప్రయోజనాలను తెస్తుంది. వెండి ఉంగరాలు ధరించడం వల్ల ఈ రాశివారికి ఓపిక పెరుగుతుంది. ప్రశాంతంగా ఉంటుంది.
47
telugu astrology
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి ని అంగారక గ్రహం, ప్లూటో పాలిస్తూ ఉంటుంది. ఇది వారిని తీవ్రంగా,ఉద్రేకపూరితంగా చేస్తుంది. వెండి వారి భావోద్వేగాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది, నెగిటివిటీ తగ్గుతుంది. ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
57
telugu astrology
మీనరాశి..
మీన రాశిని నెప్ట్యూన్, బృహస్పతి పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు అత్యంత ఆధ్యాత్మికంగా ఉంటారు.వెండి వారి కలల స్వభావాన్ని పెంచుతుంది. సృజనాత్మకతను పెంచుతుంది. శరీరాన్ని బలపరస్తుంది. వీరికి అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది.
67
telugu astrology
తుల రాశి..
తుల రాశిని శుక్రుడు పరిపాలిస్తాడు. ఈ రాశివారికి కూడా సహజంగా బంగారం చాలా మంచిది. అయితే, బంగారంతో పాటు వెండి కూడా అనుకూలంగానే ఉంటుంది. సహజంగా ఈ రాశివారు సమతుల్యతను కోరుకుంటారు. వెండి ధరించడం వల్ల కూడా మేలు చేస్తుంది.
77
ఏ రాశుల వారు వెండితో జాగ్రత్తగా ఉండాలి?
మేషం, సింహం, ధనుస్సు:
మేష రాశిని అంగారక గ్రహం పాలిస్తుంది. ఈ రాశివారు అధిక శక్తితో వృద్ధి చెందుతుంది. వెండి, శీతలీకరణ ప్రభావం వారు మండుతున్న ఉత్సాహాన్ని తగ్గిస్తుంది.అదేవిధంగా సింహ రాశిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశివారు బంగారం ధరించడం ఉత్తమం. వెండికి దూరంగా ఉండాలి. అంతేకాదు.. ధనస్సు రాశి వారికి కూడా వెండి పెద్దగా సరిపోలేదు. అదృష్టాన్ని తీసుకురాకపోగా.. సమస్యలు తెచ్చి పెడుతుంది. ఇక మకరం, కుంభం, కన్య, మిథున రాశివారు కూడా వెండి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారికి వెండి పెద్దగా కలిసిరాదు.