ఏ చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు?

First Published | May 26, 2024, 3:32 PM IST

ఇంటి దగ్గర పెరట్లో లేదా బాల్కనీలో ఏ కొంచెం ప్లేస్ ఉన్నా దాంట్లో రకరకాల మొక్కలను పెంచుతుంటారు చాలా మంది. మొక్కలు ఇంటి వాతావరణాన్ని అందంగా మార్చడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం.. కొన్ని మొక్కలను ఇంటి దగ్గర అస్సలు పెంచకూడదు. అవేంటంటే?

చింత చెట్టు

చింతచెట్లు చాలా గుబురుగా, వెడల్పుగా, చాలా పెద్దగా పెరుగుతాయి. ఈ చెట్లను ఎక్కువగా పొలాల్లోనే పెంచుతారు. కొంతమంది వీటిని ఇంటి దగ్గర కూడా పెంచుతుంటారు. కానీ ఇంటి దగ్గర చింతచెట్టును న ాటకూడదు. వాస్తు ప్రకారం.. ఈ చెట్టు ఆర్థిక ఇబ్బందులను తెస్తుంది. 
 

cotton plant


పత్తి మొక్క

పత్తిని మనం దీపాన్ని వెళిగించడానికే కాకుండా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తుంటాం. వీటిని ఇంటి దగ్గర పెంచేవారు కూడా ఉన్నారు. కానీ పత్తి మొక్కను ఇంటి దగ్గర పెంచితే దురదృష్టం వస్తుంది.
 


గోరింటాకు మొక్క

అమ్మాయిలకు గోరింటాకు అంటే ఎక్కడ లేని ఇష్టం.  అందుకే ఈ మొక్కను చాలా మంది ఆడవారు ఇంటి దగ్గరే పెంచుతారు. కానీ వాస్తు ప్రకారం.. గోరింటాకు మొక్కను ఇంటి దగ్గర అస్సలు పెంచకూడదు. ఎందుకంటే ఈ మొక్క దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది.


ముల్ల మొక్క

ముల్ల మొక్కలు చూడటానికి అందంగా కనిపిస్తాయి. అందుకే వీటిని చాలా మంది బాల్కనీలో పెంచుకుంటుంటారు. కానీ ఇంట్లో పొడవాటి ముళ్లు ఉన్న  మొక్కను నాటడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
 

బోన్సాయ్ చెట్టు

ఇంటి లోపల అందంగా కనిపించడానికి చాలా మంది బొన్సాయ్ చెట్లను పెంచుతారు. ఈ మొక్కలు ఎంతో అందంగా ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం ఇంట్లో బోన్సాయ్ చెట్లను ఉంచకూడదు. దీని వల్ల కుటుంబ సభ్యుల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.

వెదురు మొక్క

వాస్తు ప్రకారం.. ఇంట్లో వెదురు మొక్క ఉండటం మంచిది. కానీ దానిని ఇంటికి దక్షిణ, పడమర దిశలో ఉంచకూడదు. ఇలా చేస్తే మీ కుటుంబంలో ఆనందం తగ్గుతుంది.

Latest Videos

click me!