Your Weekly Horoscopes:ఓ రాశివారు ఈ వారం ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు

First Published | May 26, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology

26-05-24  నుంచి  01-06-24 వార ఫలాలు

 మేషం (అశ్విని  భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం.అనవసరమైన ఆలోచనలు కలుగును. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహంగా ఉంటాయి.దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉన్న సహకారం కూడా పోగొట్టి కోవలసివస్తుంది.మానసిక అశాంతి ఏకాగ్రత లేకుండా ఉండటం.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి.ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి.ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.ప్రయాణాలు అనుకూలిస్తాయి.శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు వలన పనులు పూర్తి అగును.సమాజంలో మాట చెల్లుబాటు అవుతుంది.రావలసిన డబ్బులు వసూలు అవును.ఉద్యోగులకు పై అధికారుల అండ దండలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారు.ఆర్థికపరమైన విషయాలు బలపడతాయి.వస్తు వాహన సౌకర్యాలు ఏర్పడగలవు.శారీరక మానసిక ఆనందం పొందగలరు. ఇతరులతో సంబంధం బాంధవ్యాలు పెరుగుతాయి.


telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఉద్యోగస్తులు తమ యొక్క విధి ని సక్రమంగా నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారం సజావుగా సాగుతాయి.కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును.సంతానం కోసం అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు.గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు.గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి.కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరిస్తారు.చేయు వ్యవహారాల్లో ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.గృహంలో సుఖశాంతులు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.బంధుమిత్రులతో  సహాయ సహకారాలు లభిస్తాయి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2


చీకు చింత పెరుగుతాయి.ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు.చేయు వ్యవహారాల్లో తెలివితేటలు పనిచేయక ఇబ్బందులకు గురి అవుతారు.
శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టం గా ఉంటుంది.పనుల్లో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.సమస్యలు ఏర్పడగలవు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి.వ్యాపారము నందు జాగ్రత్త అవసరం.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.దుష్కార్య ఆలోచనలు కలుగును.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం.అకారణం గా బంధు వర్గం తో విరోధాలు ఏర్పడగలవు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

మానసికంగా భయాందోళన గా ఉంటుంది.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.అవసరానికి చేతిలో సరిగా డబ్బు ఉండదు.వృధా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి.చేయు వ్యవహారములో పంతాలు కు పట్టింపులకు పోకుండా లౌక్యంగా మీ పనులు చక్కబెట్టుకోవాలి.కీలకమైన సమస్య పరిష్కార మగును.ఉద్యోగస్తులు పై అధికారులతో మాట పడవలసి వస్తుంది.ఇతరుల విషయంలో మరియు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనం సాధించడం కష్టంగా ఉంటుంది.తలపెట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలి.రావలసిన ధనం చేతికందక ఆందోళన కలుగును.బంధు మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడగలవు.వృత్తి విషయంలో ఆందోళన కలుగును.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

మానసిక శారీరక ఆనందం పొందగలరు.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అన్నివైపుల నుంచి శుభ ఫలితాలు పొందగలరు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు.ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు చేసే వారికి సదావకాశం లభించును.దానధర్మాలు చేస్తారు.సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి.ఆశయం నెరవేరడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది.ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును.వృత్తి వ్యాపార సంబంధాలు బలపడతాయి.ప్రయాణాలు అనుకూలించును.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వస్తు వాహనాది ఆభరణాలు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
 

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి ,విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
కుటుంబ సంబంధిత విషయాలు ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను.ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి.ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది.వాగ్దానాలకు హామీలకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి.కుటుంబ సమస్యలు ఏర్పడి చిరాకు కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.అభివృద్ధికి సంబంధిత కీలక నిర్ణయం తీసుకుంటారు. చేయు వ్యవహారం నందు స్థిరమైన బుద్ధి తో ముందుకు సాగాలి.సభలు సమావేశాలు పాల్గొంటారు.కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి.ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా ఫలితం కనిపిస్తుంది.ఆదాయ వ్యయాలకు పొంతన ఉండక పోవచ్చు.వాగ్దానాలు వలన వివాదాలు ఏర్పడగలవు.అనుకున్న పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త అవసరం.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

బంధువులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.వ్యాపారాలు లాభసాటిగా జరుగును.కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.ఆ‌రోగ్యం బాగుంటుంది.  ఉద్యోగస్తుల హోదా లభిస్తుంది.పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు ఆలోచన శక్తి తో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వినోదాత్మకంగా గడుపుతారు.  భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలించును.ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది.సంఘంలో ఉన్నత స్థితి ఉన్న వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి.శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.  

telugu astrology

ధనుస్సు (మూల,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

వ్యాపార భాగస్వాముల  పెట్టుబడి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.రుణాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడగలవు. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఏర్పడగలవు. ప్రత్యర్థులతో జాగ్రత్త అవసరం.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రావలసిన బాకీలు లౌక్యం గా వసూలు కోవాలి.మిత్రులతో మనస్పర్థలు రాగలవు.  మనస్సునందు భయంగా ఉంటుంది.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.సమాజంలో గౌరవం తగ్గుతుంది.అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది.మానసికంగా శారీరకంగా బలహీనపడతారు.ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

telugu astrology


మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

కొత్త విషయాలు తెలుసుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు.భూ గృహ స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగును.కొంత కాలంగా పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు.అనుకోని అవకాశాలు అప్రయత్నంగా లభించును.తలపెట్టిన కార్యక్రమంలో సాధిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగాలలో అధికారులు ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.సమస్యలు వివాదాలు పరిష్కారం అవును. కీలకమైన నిర్ణయాలు లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకొనుట మంచిది. స్థిరాస్తి విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందగలరు.వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8


నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.ఆశించిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు.సమాజంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలు లో పాల్గొంటారు.బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ప్రశాంతత లభిస్తుంది.నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించును.ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానం పొందగలరు. శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండాలి.ఇతరులతో విరోధం ఏర్పడిన విజయం లభిస్తుంది.ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4,ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఆర్థిక ప్రయత్నాల్లో ప్రతికూలత వాతావరణం.కీలకమైన సమస్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పరిష్కారం లభిస్తుంది.ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉంటుంది.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.శారీరక కష్టం అధికంగా ఉంటుంది. తలచిన పనులు లో అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కో గలుగుతారు.అనవసరమైన విషయాలు కు వివాదాలకు దూరంగా ఉండాలి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు ప్రయాణంలో జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos

click me!