షాపింగ్ విషయంలో.. ఏ రాశివారి అభిరుచి ఎలా ఉంటుందంటే...

Published : Apr 26, 2022, 01:09 PM ISTUpdated : Apr 26, 2022, 01:12 PM IST

షాపింగ్.. ఈ మాట వింటూనే ముఖంలో వెలుగు వచ్చేస్తుంది. అయితే కొంతమందితో షాపింగ్ చేస్తే బోర్ గా ఉంటుంది. కానీ మరికొంతమందితో షాపింగ్ చేస్తే ఉత్సాహంగా ఉంటుంది. అయితే, ఇదంగా కూడా రాశి ప్రకారమే ఉంటుందట.   

PREV
111
షాపింగ్ విషయంలో.. ఏ రాశివారి అభిరుచి ఎలా ఉంటుందంటే...
Aries

మేషరాశి (Aries) : వీళ్లతో షాపింగ్ అంటే జేబు కాస్త బరువుగానే ఉండాలి. ఎందుకంటే వీరు ఖరీధైన బ్రాండెడ్ స్టోర్స్ లోనే షాపింగ్ చేస్తారు. అంతేకాదు ఏ స్టోర్ లోకి వెళ్లినా ఒక్కటైనా కొనకుండా వెనక్కి రారు. 

211

వృషభరాశి (Taurus) : ఈ రాశివారికి లగ్జరీ అంటే ఇష్టమే.. అయితే దానికంటే ఎక్కువ మంచి లగ్జరీ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం. అందుకే ఆ రెండూ సమన్వయం అయ్యేలా తమ షాపింగ్ ఉండేలా చూసుకుంటారు.

311
Gemini

మిధునరాశి (Gemini) : షాపింగ్ లో చక్కటి చేదోడు, వాదోడుగా ఉంటారు మిధునరాశివారు. ఏదైనా కొనేముందు దానికి సంబంధించి బాగా తెలుసుకుంటారు. తమతో వచ్చినవారికి సూటయ్యే అవుట్ ఫిట్స్ ను పర్ ఫెక్ట్ గా సెలెక్ట్ చేస్తారు.

411
Leo

సింహరాశి (Leo) : జిగేల్ జిగేల్ మనే వస్తువులు, దుస్తులు వీరిని ఆకర్షిస్తాయి. అందుకే లీయో వాళ్లు సర్వోస్కీ, బాబుల్స్ లాంటి మెరిసేవి ఉన్న స్టోర్స్ లో ఎక్కువగా కనిపిస్తారు. 

511
(Virgo)

కన్యారాశి (Virgo) : డబ్బులు ఖర్చుపెట్టడం విషయంలో వీరికి పెద్దగా నమ్మకం ఉండదు. వారికి నచ్చినది ఏదైనా సరే కనిపిస్తుందా అని షాపు మొత్తం గాలిస్తారు. నచ్చినదాన్ని వెంటనే కొనరు.. ధర, అవసరం అన్నీ బేరీజు వేసుకుంటారు. 

611
Libra

తులారాశి (Libra) : షాపింగ్ విషయంలో తులారాశివారు మిధునరాశి వారి  సహాయం కోరతారు. షాపింగ్ విషయంలో తమ నిర్ణయం సరిగా ఉండని అనుకుంటారు. 

711
Scorpio

వృశ్చికరాశి (Scorpio) : వీరు ఎక్కువగా జిమ్ వస్తువులు షాపింగ్ చేస్తూ కనిపిస్తారు. లేదా మాకరోనీ తింటూ ఎవరితోనో చిట్ చాట్ చేస్తూ కనిపిస్తారు. 

811

ధనుస్సురాశి (Sagittarius) : వీళ్లు ఎక్కువగా షాపింగ్ చేయరు.. కానీ గోల్డ్ స్కీమ్ లు, నగల దుకాణాలు పెట్టే స్కీముల గురించి ఆరాతీస్తూ ఉంటారు. 

911
Capricorn

మకరరాశి (Capricorn) : వీరికి క్వాలిటీ చాలా ముఖ్యం. అందుకే వీరు ఖరీదైన బ్యాగులు, చర్మసంరక్షణ వస్తువులు కొనడం విషయంలో చాలాజాగ్రత్త చూపిస్తారు. అందుకే ఒకవేళ వాటిని ఉచితంగా ఇస్తున్నట్లయితే తీసుకోవడానికి ఆలోచిస్తారు. 

1011

కుంభరాశి (Aquarius) : చంకీగా ఉండేవి, కొంచెం డిఫరెంట్ గా ఉండేవి అంటే వీరికి ఇష్టం. అందుకే అలాంటి ఆభరణాలు, బట్టలు కొనడానికి చూస్తుంటారు. కొత్త స్టైల్ క్రియేట్ చేయాలనుకుంటారు. 

1111
Pisces

మీనరాశి (Pisces) : క్యాండిల్స్, సుగంధద్రవ్యాలు ఉండే స్టోర్స్ లో ఎక్కువగా కనిపిస్తారు. లేదా వృషభరాశివారికి షాపింగ్ లో సహాయం చేస్తూ కనిపిస్తారు. 

click me!

Recommended Stories