నిద్రపోతున్నప్పుడు కలలు పడటం చాలా సహజం. మన ఆలోచనలు ఎలా ఉంటే అలాంటి కలలే పడుతుంటాయని చాలా మంది అంటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మన ఆలోచనతో సంబంధం లేకుండా కలలు పడుతుంటాయి. ఇలాంటి వాటిని తేలిగ్గా తీసిపారేస్తుంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను చెప్తుంది. నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలకు మన నిజజీవితానికి ప్రత్యక్ష, లోతైన సంబంధాన్ని కలిగి ఉంటుందని జ్యోతిష్యులు చెప్తారు.
మార్నింగ్ డ్రీమ్స్
చాలా మందికి పొద్దు పొద్దున్నే కలలు పడుతుంటాయి. అయితే కొంతమంది కలలను నిద్రలేచిన వెంటనే మర్చిపోతుంటారు. కానీ కొన్ని కలలు మాత్రం మనకు అలాగే గుర్తుండిపోతాయి. అయితే పొద్దు పొద్దున్నే మనకు వచ్చే కలలు నిజమవుతాయని చాలా మంది చెప్తుంటారు. నిజానికి ఉదయం పడే కలను చాలా పవిత్రంగా భావిస్తారు. ఉదయం ఎలాంటి కలలు పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మందిరం
పొద్దు పొద్దున్నే కలలో గుడి కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుందని, ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్ముతారు.
దేవతలను చూస్తే..
కలలో దేవుడిని చూడటాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి కల పడితే దాని అర్థం మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఇది మీ బంగారు భవిష్యత్తును సూచిస్తుంది.
చెట్టు ఎక్కినట్టు ..
ఒక వ్యక్తి ఉదయాన్నే కలలో చెట్టు ఎక్కినట్టు కనిపిస్తే కూడా దానిని శుభప్రదంగా భావిస్తారు. మీరు కలలో చెట్టు ఎక్కడం చూస్తే మీకు డబ్బు వస్తుందని అర్థం. ఇది మీకు సంపద పెరగడాన్ని సూచిస్తుంది.
దుస్తులు కుట్టడం
కలలో మగవారు లేదా ఆడవాళ్లు బట్టలు కుట్టడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇది కూడా మీకు మంచి రోజులు రావడాన్ని సూచిస్తుంది.
ఉసిరి తినడం
మీరు కలలో ఉసిరికాయను తినడం చూస్తే కూడా మంచిదే. ఈ కల మీకు సంపద సంపాదించాలనే కోరిక నెరవేరబోతోందని సూచిస్తుంది. అలాగే డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీకు పెరుగుతాయని అర్థం వస్తుంది.
dreams
కలలో ఏడుపు
చాలా మంది కలలో కూడా ఏడుస్తుంటారు. ఇది మంచిది కాదని చాలా మంది అంటుంటారు. కానీ కలలో ఏడుపు గురించి కలలు కనడం సంతోషకరమైన సంఘటనలకు సంకేతమని డ్రీమ్ సైన్స్ చెబుతోంది.