మనం పుట్టిన తేదీని బట్టి, మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేయవచ్చని మీకు తెలిసే ఉండొచ్చు. అయితే, అది మాత్రమే కాదు. న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టినప్పుడే మనకు కొన్ని పవర్స్ వస్తాయట. మన పుట్టిన తేదీ ప్రకారం మనందరికీ మనలో ఓ శక్తి ఉంటుంది. మరి మనలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకుందాం...
సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఇది సృష్టి సంఖ్య. ఈ ప్రభావంతో జన్మించిన వారికి తమ ఇష్టాన్ని నొక్కి చెప్పే శక్తి ఉంటుంది. అయితే, మీరు ఇతరులను మార్చటానికి ప్రయత్నించకూడదు.