ఆగస్టులో పుట్టిన వారు చాలా స్పెషల్.. వీళ్లు ఎలా ఉంటారో తెలుసా?

First Published | Aug 11, 2024, 12:51 PM IST

గ్రంధాల ప్రకారం.. ఒక్కో నెలలో పుట్టిన వారు ఒక్కోవిధమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మరి ఆగస్టు నెలలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం పదండి.
 

గ్రంధాల ప్రకారం.. పుట్టిన తేదీ ఒక్కటే కాకుండా.. పుట్టిన నెలను బట్టి కూడా మన స్వభావం, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చు. అందుకే ఇది ఆగస్టు నెల కాబట్టి ఈ నెలలో పుట్టిన వారి స్వభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఆత్మవిశ్వాసం.. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆగస్టు నెలలో పుట్టిన పిల్లలు, పెద్దలు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ నెలలో పుట్టిన వారు మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారు.


మొండి స్వభావం 

అవును  ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా మొండిగా ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు వీళ్లు తమ మాటకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనుకుంటారు. ఈ నెలలో పుట్టిన వారు తమకున్న సున్నితమైన ప్రవర్తనను దాచడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు.
 


వదులుకోరు 

ఆగస్టు నెలలో జన్మించిన వారు వారు సాధించాలనుకున్న వాటిని ఎప్పటికీ వదులుకోరు. అంతేకాదు వీళ్లు తమను తాము ఎంతగానో ప్రేరేపించుకుంటారు. అలాగే వీళ్లు ఆశావహంగా కూడా ఉంటారు.
 

ఫుల్ ఎనర్జీ..

ఆగస్టు నెలలో జన్మించిన వారు ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతేకాదు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటిని అధిగమించేదాక నిద్రపోరు. వీళ్లకు మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. 
 

తెలివైన వారు 

జోతిష్యుల ప్రకారం.. ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా తెలివైనవారు. వీళ్లు వారి సమాజ శ్రేయస్సు కోసం బాగా పని చేస్తారు. కానీ దీనిలో కూడా  స్వార్థం ఉంటుంది. అంటే వీరికి కూడా స్వార్థ గుణం ఉంటుంది.

స్పష్టంగా మాట్లాడటం

వాస్తు ప్రకారం.. ఆగస్టు నెలలో జన్మించిన వారు చాలా నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. వీరికి స్పష్టంగా మాట్లాడే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటే వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 

ధనవంతులు 

ఆగస్టు నెలలో జన్మించిన వ్యక్తులు చాలా ప్రతిభావంతులు. అలాగే వీళ్లు కళలు, సాహిత్యం, సృజనాత్మక ప్రక్రియలలో తమదైన ముద్ర వేస్తారు. వీరు జీవితంలో బాగా డబ్బును సంపాదిస్తారు. 

Latest Videos

click me!