చాలాసార్లు కాకులు లేదా పావురాలు వచ్చి మన ఇంటి పైకప్పు, గేటు లేదా కిటికీపై కూర్చుంటాయి. అలాగే కొన్ని సార్లు ఆహారం కనిపిస్తే ఇంట్లోకి కూడా వస్తుంటాయి. అయితే ఇంట్లోకి కాకి రావడం వల్ల అనేక రకాల సంకేతాలు వస్తాయని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా ఇంటికి లేదా ఇంట్లోకి కాకి వస్తే ఏమౌతుంది? కాకిని చూడటం అదృష్టమా? దురదృష్టమా? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Crow
ప్రయాణానికి ముందే కాకులు వస్తే..
మీరు ఎటైనా వెళ్లడానికి సిద్దమవుతున్నప్పుడు.. మీ ఇంటికి కాకి రావడం శుభప్రదంగా భావిస్తారు. మీ ప్రయాణాని కంటే ముందే కాకి మీ ఇంటికి వస్తే.. మీ ప్రయాణం విజయవంతమవుతుందని అర్థం. కాబట్టి ఈ సమయంలో కాకి వచ్చిందేంటి అని మీరు భయపడాల్సిన అవసరం లేదు.
పొద్దున్నే ఇంటికి కాకి వస్తే..
పొద్దున్నే ఇంటి పైకప్పుపై కాకులు వాలుతుంటాయి. అయితే ఇలా పొద్దు పొద్దేన్నే మీ ఇంటి పై కప్పుపై కాకి వాలితే మీ ఇంటికి ఒక అతిథి వస్తున్నాడని అర్థం. దీన్ని కూడా మంచి సంకేతంగా భావిస్తారు.
గుంపులుగా వస్తున్న కాకులు
కొన్ని కొన్ని సార్లు కాకులు గుంపులు గుంపులు వస్తుంటయాి. అయితే మీ ఇంటికి కూడా కాకులు గుంపులు గుంపులుగా వస్తే.. మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థం. ఎందుకంటే ఈ కాకులు ఏదో అవాంఛనీయమైన విషయాన్ని సూచిస్తాయి.
Crow
దక్షిణ దిశలో వస్తున్న కాకి..
కాకి మీ ఇంటికి దక్షిణం వైపు రావడం మంచిది కాదు. ఎందుకంటే దీన్ని అశుభంగా భావిస్తారు. అంటే దీని అర్థం.. మీ నాన్నకు మీ మీద కోపం ఉందని.. మీ ఇంట్లో పితృ దోషం ఉందని అర్థం వస్తుంది.
కాకి తన్నితే..
కాకి మీ ఇంటికి వచ్చి.. మిమ్మల్ని కాళ్లతో తన్నితే కూడా మంచిది కాదు. దీన్ని అశుభంగా పరిగణిస్తారు. దీన్ని పెద్ద చెడు శకునంగా భావిస్తారు. అంటే రాబోయే కాలంలో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారని ఇది సూచిస్తుంది
కాకి రొట్టెలు తింటూ..
కాకి మీ ఇంటికి వచ్చి రొట్టె తింటే చాలా మంచిదని భావిస్తారు. దీనర్థం త్వరలోనే మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి.
ఇంట్లో కాకి గుడ్డు..
ఇంట్లో ఎక్కడైనా కాకి గుడ్డు కనిపిస్తే శుభసూచకంగా భావిస్తారు. అంటే మీ ఇంటికి ఏదో శుభవార్త రాబోతోందని ఇది సూచిస్తుంది.
కాకి నీళ్లు తాగితే..
కాకి వచ్చి మీ ఇంటి పై కప్పు బాల్కనీ లేదా కిటికీపై నీళ్లు తాగితే మంచిదని భావిస్తారు. దీని అర్థం మీరు డబ్బు సంపాదించబోతున్నారు.