Today Horoscope:ఓ రాశివారు ఈ రోజు విశేష ధన లాభం పొందుతారు

Published : Feb 11, 2024, 05:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు..ఆర్థిక విషయాలు వలన మానసిక ఆందోళన ఏర్పడను. కర్మాగారంలో చేసేవారు తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి. సోదర వర్గంతో మనస్పర్ధలు విరోధాలు రాకుండా చూసుకోవాలి.  

PREV
113
Today Horoscope:ఓ రాశివారు ఈ రోజు విశేష ధన లాభం పొందుతారు
Horoscope

11-2-2024 ఆదివారం మీ  రాశి ఫలాలు  (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
 

213
telugu astrology


మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1 2 3 4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉంటుంది .

కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

దిన ఫలం:-వ్యాపారాల్లో చక్కటి ధనలాభం లభిస్తుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు వలన ఆనందం కలుగుతుంది.ఓం భద్రకాళీశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

దిన ఫలం:-ఆర్థిక విషయాలు వలన మానసిక ఆందోళన ఏర్పడను. కర్మాగారంలో చేసేవారు తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి. సోదర వర్గంతో మనస్పర్ధలు విరోధాలు రాకుండా చూసుకోవాలి. మానసిక చికాకులు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు . సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాల్లో సమస్యలు రాకుండా చూసుకోవాలి.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర 1 2 3 4 పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును. సమాజంలో అపవాదము రాగలవు.

పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో విశేష ధన లాభం కలుగును. ఉద్యోగ విషయాల అనుకూలం.సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.ఓం శ్రీ మాత్రే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది .

ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-శత్రువుల వలన పరాభవం జరిగే అవకాశం. భార్యాభర్తల మధ్య వివాదాల తలెత్తకుండా చూసుకోవాలి. మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును. సమాజంలో అపవాదములు రాకుండా చూసుకోవాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవగలవు. ఆర్థిక పరిస్థితి నిరత్సాహపరుస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4 ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో  ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఏర్పడి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వైవాహిక జీవితంలో కొద్దిపాట అసంతృప్తి ఎదురవుతుంది. వ్యాపార వ్యవహారాలు లాభసాటుగా ఉంటాయి. ఇతరుల మాటలకు ప్రలోభాలకు లొంగకుండా చూసుకోవాలి. లేదా నష్టపోయే అవకాశం. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ఓం కార్తికేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-కుటుంబ సభ్యుల నుండి ఆశించిన గౌరవం పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఇతరులకు  సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు. ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి 1 2 3 4 విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును.అపవాదము రాగలదు.

విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-వ్యాపార రంగంలోని వారికి అన్న విధాల అనుకూలంగా ఉంటాయి . తలపెట్టిన కార్యాలలో అఖండ విజయం సాధిస్తారు. చేసే వృత్తుల వారికి ప్రతిభకు తగ్గ ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఓం నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

913
telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత.

జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-ప్రయత్నించిన కార్యాలలో వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మానసికంగా అధిక ఒత్తిడి ఎదురుకోవలసిన పరిస్థితులు రాగలవు. ఆర్థిక సంబంధమైన విషయాలలో నష్టం జరగకుండా చూసుకోవడం మంచిది. శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కోపోద్రేకములు తగ్గించుకుని వ్యవహరించాలి. ఉద్యోగాల్లో పై అధికారులతో మాట పడకుండా జాగ్రత్త పడడం అవసరం.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1013
telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు) వ్యాపారంలో ధన లాభం. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆశించిన ధన లాభం పొందగలరు.

పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానాలు కలుగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉండును

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి) శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

దిన ఫలం:-న్యాయపరంగా విశేషమైన ధనాన్ని సంపాదిస్తారు. అన్ని రంగముల వారు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గౌరవ ప్రదమైన జీవన విధానంతో ఆనందంగా గడుపుతారు. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రావలసిన నగదు చేతికి అందుతుంది.ఓం సుదర్శనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడును .వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగును. కుటుంబ పరమైన సమస్యలు చిరాకు పుట్టిస్తాయి. అపవాదము రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా ఉండును.  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సమాజంలో  అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారాల్లో కోపం అధికంగా ఉంటుంది .ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని) మానసిక చికాకులు.ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉండును. అపవాదము రాగలవు.

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు ) ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వ్యాపారంలో ధన నష్టం. పనుల్లో ఆటంకాలు.

దిన ఫలం:-అనవసరమైన ఘర్షణకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులు నిదానముగా పూర్తి అగును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేసిన వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. దుర్జన సహవాసాలు వలన అపఖ్యాతి రాగలదు. ఇతరులతో అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను. వ్యాపారాల్లో ధన నష్టము. పనుల యందు ఆటంకాలు ఎదురవుతాయి.ఓం శంభవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1313
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు) బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం .అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధన లాభం పొందుతారు.ఆలోచనలు కార్యాచరణలో  పెడతారు. విద్యార్థులకు అనుకూలం. నూతన పరిచయాలు ఏర్పడను. మిత్రుల సహాయ సహకారములు సంపూర్ణముగా లభించును. అందరి మన్ననలు పొందగలరు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు .ఓం విఘ్నరాజాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

Read more Photos on
click me!

Recommended Stories