
దీపావళి పండగ వచ్చిందంటే చాలు.. చాలా మంది తమ ప్రియమైన వారికి బహుతులు ఇస్తూ ఉంటారు. అయితే.... చాలా మందికి ఎవరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలి అనే విషయంలో క్లారిటీ ఉండదు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారికి ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందో ఓసారి చూద్దాం...
1.మేష రాశి..
మేష రాశివారి కోసం మీరు బహుమతి కొనుగోలు చేయాలని చూస్తుంటే... వారికి అగ్నికి సంబంధించినవి ఇవ్వడం ఉత్తమం ఈ రాశిని మార్స్ పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టి.. వీరికి రెడ్ కలర్ క్యాండిల్స్, దుస్తులు, దీపావళికి ఉపయోగపడే లైట్స్ లాంటివి ఇవ్వడం మంచిది. వారికి అవి అదృష్టాన్ని కలిగిస్తాయి.
2.వృషభ రాశి..
వృషభరాశికి బహుమతి కొనేటపుడు అందం ఆలోచించండి,కళాత్మకంగా ఆలోచించండి. ఈ రాశి వారు తమ బహుమతులను స్టైలిష్, క్లాస్‌గా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు. అందమైన ప్రదేశాలను వీరు ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు వారికి వారి ఇంటి కళాత్మక సౌందర్యాన్ని జోడించే ఇంటి అలంకరణ వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు.
3.మిథున రాశి..
మిథున రాశివారు కమ్యూనికేషన్ చిహ్నం, మీ ఆలోచనలను ఇష్టపడతారు. కొన్ని ఆసక్తికరమైన స్టేషనరీ, ఒక అదృష్ట వెదురు మొక్కను ఎంచుకోండి లేదా వారికి గణేశ విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వండి.
4.కర్కాటక రాశి..
కర్కాటక రాశికి సరైన బహుమతి వెండితో చేసినది. వెండి నాణెం, వెండి గాజు లేదా వెండి ఆభరణాలు కూడా వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తాయి. అవి ఇవ్వడం ఉత్తమం.
5.సింహ రాశి..
సూర్యునిచే పాలించబడిన ఈ అగ్ని రాశికి, రాగి చాలా అదృష్ట మూలకం, ఎరుపు అదృష్ట రంగు. మీరు వారికి రాగితో చేసిన వాల్ ఆర్ట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు లేదా రాగితో చేసిన పాత్రలను ఎంచుకోవచ్చు. గుర్రాలతో ఉన్న విగ్రహం వారికి చాలా అదృష్టంగా ఉంటుంది
6.కన్య రాశి..
కన్య రాశివారికి పచ్చ లేదా పచ్చ ఆభరణాలు, పచ్చని కొవ్వొత్తులు, కుబేరుడి విగ్రహం లేదా కుబేరు యంత్రం వారికి అదృష్టాన్ని తెస్తుంది. వీటిలో ఏదైనా వారికి బహుమతిగా ఇవ్వచ్చు.
7.తుల రాశి..
తుల రాశివారికి విలాసవంతంగా ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి వారికి ఉత్తమమైన బహుమతి సుగంధాలు, సువాసనలు ఇచ్చేవి. మీకు పెద్ద బడ్జెట్ ఉంటే, వజ్రాలు కూడా ఇవ్వచ్చు.
8.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారు నీటికి సంకేతం. ఘాటైన సువాసనలు ఇచ్చే వస్తువులను వారికి మంచి బహుమతి గా ఇవ్వచ్చు. మీరు వారి కోసం బహుమతులను ఇవ్వాలని అనుకుంటే..వారికి మట్టి లేదా మట్టి కుండలు , దియాలు వంటివి బహుమతిగా ఇవ్వచ్చు.
9.ధనస్సు రాశి...
ధనస్సు రాశివారికి బంగారం అదృష్టాన్ని కలిగిస్తుంది. బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణెం ఒక ఖచ్చితమైన బహుమతి. బడ్జెట్‌కు అడ్డంకులు ఉంటే, మీరు వారికి పసుపు రంగు మిఠాయిలు లేదా కుంకుమను కొనుగోలు చేయవచ్చు లేదా పసుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వవచ్చు.
10.మకర రాశి..
వారికి సిరామిక్ కళాఖండాలు ఇవ్వండి. వారికి అదృష్టాన్ని తీసుకురావడానికి వెండి, తెలుపు కలగలసిన వాటిని ఎంచుకోండి. ఒక ప్లానర్ లేదా వారి వర్క్ డెస్క్ కోసం ఆర్గనైజర్ లేదా వారు మీ కంటే చిన్నవారైతే గడియారం వంటి వాటిని ఇవ్వండి. వారి జీవితంలో క్రమశిక్షణను తీసుకురావడానికి వారికి సహాయపడే ఏదైనా వారికి నిజంగా అదృష్టమే ఇస్తుంది.
11.కుంభ రాశి..
భూమి మూలకాన్ని సూచించే ఏదైనా వారికి అద్భుతమైన బహుమతి వస్తువుగా మారుతుంది. సిరామిక్ కుండీలు, మట్టి లేదా మట్టి కుండలు లేదా వెండి పాత్రలు లేదా వెండి ప్లేట్లు కూడా ఈ రాశికి అదృష్టాన్ని తెస్తాయి.
12.మీన రాశి..
మీన రాశివారికి అదృష్టం కలగాలంటే.. కొవ్వొత్తులు, ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నవి, సిట్రిన్ లేదా బంగారంతో చేసిన ఆభరణాలు వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి.