ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, తమ సంపద పెంచుకోవాలనే చూస్తారు. అయితే.. కొందరు చూస్తూ చూస్తుండగానే ధనవంతులు అయిపోతారు. కొందరు మాత్రం... ఎంత కష్టపడినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లుగా ఉంటారు. అలా ఎదుగు, బొదుగు లేకుండా మిగిలిపోవడానికి కూడా కారణాలు ఉంటాయట. మనం సంపాదించిన డబ్బును ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ మూలలో పెడితే.. లక్ష్మీదేవి మరింతగా డబ్బును ఆకర్షిస్తుందో కచ్చితంగా తెలుసుకోవాలి. మరి.. మీరు ఏ మూలలో డబ్బుును దాచుతున్నారు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఇంట్లో డబ్బును ఎక్కడ దాచాలో ఇప్పుడు తెలుసుకుందాం..
wealth
జోతిష్యశాస్త్రం ప్రకారం.. కుబేరుడు ఉత్తర దిక్కన నివసిస్తాడట. అందుకే.. మనం డబ్బు దాచుకునే కప్ బోర్డ్ ఎప్పుడూ దక్షిణం వైపే ఉండాలని.. అప్పుడే సంపద నిలపడుతుందని నమ్ముతారు.
హిందూ శాస్త్రం ప్రకారం... తూర్పు దిక్కును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి.. ఈ తూర్పు దిక్కు చాలా మంచిది. కాబట్టి.. మీరు ఇంట్లో తూర్పు దిక్కున కూడా.. డబ్బు, బంగారం కూడా మనం ఉంచుకోవచ్చు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎక్కువగా ఆకర్షిస్తుంది.
మీరు కనుక తూర్పు దిక్కున ఇంట్లో డబ్బును పెట్టుకుంటున్నట్లయితే.. ఎక్కువ సమయం ఇంటి తలుపులు తెరచి ఉంచాలట. అప్పుడు... సులభంగా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందట.
మీరు మీ డబ్బులు దాచుకునే కప్ బోర్డ్ కనుక.. దక్షిణం వైపు కనుక ఉంచితే... దానిని తెరిచే తలుపులు మాత్రం ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల.. లక్ష్మీదేవి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందట. ఆ దిక్కున పెట్టిన డబ్బు, బంగారానికి లోటు ఉండదట. మనీ షార్టేజ్ అనేది అస్సలు ఉండదు.
ఎక్కడ పెట్టాలో మాత్రమే కాదు... ఎక్కడ పెట్టకూడదు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎవరికీ కనపడకుండా ఉంటుంది కదా అని.. కొందరు డబ్బులు దాచే కబోర్డ్ ని మెట్ల కింద సీక్రెట్ గా పెడుతూ ఉంటారు. కానీ.. అలాంటి పొరపాటు అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక మనం డబ్బు, బంగారం దాచుకునే ప్రదేశంలో ఎలాంటి దుమ్ము, చెత్త లాంటివివి ఉండకుండా చూసుకోవాలి. శుభ్రంగా లేనిచోట కూడా లక్ష్మీదేవి నిలపడదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి.