Tulsi leaves: తులసి ఆకులు ఎండిపోతే ఏం చేయాలి? తులసి ఆకులను ఎలా కోయాలో తెలుసా?

Published : Jul 21, 2026, 11:22 AM IST

Tulsi leaves: దాదాపు ప్రతి దేవుడి పూజకు, శుభకార్యాల్లోనూ తులసి ఆకులు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం, తులసి ఆకులను కోసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు.

PREV
14
తులసి ఆకులు కోస్తున్నారా?

తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.తులసి చాలా పవిత్రమైనది.. అందుకే అందరూ తమ ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకుంటూ ఉంటారు. అయితే.. ఇంట్లోనే తులసి మొక్క ఉంది కదా అని చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు ఆ తులసి ఆకులను తుంచుతూ దైవారాధన కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పిస్తే.. అదృష్టం పెరుగుతుందని, కోరుకున్న కోరిక నిజం అవుతుందని నమ్ముతారు. నిజంగానే, విష్ణు మూర్తి కి తులసి ఆకులు సమర్పిస్తే.. మేలు జరుగుతుంది. కానీ.. తులసి ఆకులు కోసే విషయంలోనే పొరపాట్లు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

24
తులసి ఆకులు ఎప్పుడు కోయాలి?

హిందూ సంప్రదాయం ప్రకారం, తులసి ఆకులను ఎల్లప్పుడూ ఉదయం స్నానం చేసిన తర్వాత కోయాలి. ఆకులు కోసే ముందు, తులసి మాతకు ప్రార్థనలు చేసి, గుండెలో భక్తి కలిగి ఉండాలి. సూర్యోదయం తర్వాత మధ్యాహ్నానికి ముందు తులసి ఆకులను కోయడం శుభప్రదంగా పరిగణిస్తారు.పూజకు అవసరమైన ఆకులను మాత్రమే కోయాలి. అదనంగా కోయకూడదు.

తులసి ఆకులను ఎప్పుడు కోయకూడదు..?

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆదివారాల్లో తులసి ఆకులను కోయకూడదు. అంతేకాకుండా ఏకాదశి, సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి రోజులలో కూడా తులసి ఆకులను కోయకూడదు. ఒకవేళ పూజకు అవసరం అనిపిస్తే.. ముందు రోజే కోయాలి.

తులసి ఆకులను కోసేటప్పుడు ఏ మంత్రం జపించాలి..?

తులసి ఆకులను కోసేటప్పుడు ‘ ఓం తులస్యాయ్ నమ:’ అనే మంత్రాన్ని జపించాలి. అంతేకాకుండా, తులసి మాతను ప్రార్థించడం, విష్ణుమూర్తిని మనసులో స్మరించడం శుభప్రదం.

34
ఎండిపోయిన తులసి ఆకులను ఏం చేయాలి?

ఎండిపోయిన తులసి ఆకులను పారవేయకూడదు. కావాలనుకుంటే, వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం, ఎండిన తర్వాత కూడా తులసి ఆకులను తమ స్వచ్ఛతను నిలుపుకుంటాయి. వాటిని ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించవచ్చు. ఎండిన తులసి ఆకులను పారేయకూడదు. బదులుగా, నీటిలో వదిలేయాలి.

44
తులసి ఆకులను ఎలా కోయాలి?

తులసి ఆకులను కోనేటప్పుడు కొన్ని విషయాలను గుర్తించాలి. తులసి ఆకులను గోళ్లతో కాకుండా, జాగ్రత్తగా చేతి వేళ్లతో కోయాలి. మొక్కకు ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తపడాలి. అపరిశుభ్రమైన ప్రదేశంలో తులసి ఆకులను కోయకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories