మొండితనం, ఇతరులను చులకనగా చూడటం 13వ తేదీన పుట్టేవారి పతనానికి కారణమవుతాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వీరి కర్మ భారం మరింతగా పెరుగుతుంది. వినయంగా ఉండటం ద్వారా మాత్రమే వీరు తమ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని జయించగలరు.
వీరు భయాన్ని వదిలేసి తమ పనులను చేసుకోవాలి. నిజాయితీగా కష్టపడి, క్రమశిక్షణతో కూడిన దినచర్యను అలవాటు చేసుకోవాలి. ఇదే 13వ సంఖ్య వీరిని అపారమైన విజయానికి, ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఈ సంఖ్య వ్యక్తుల్ని నాశనం చేయడానికి కాదు, వారి వ్యక్తిత్వాన్ని బలోపేతం చేయడానికి వచ్చింది.