వారఫలాలు: ఓ రాశివారికి వారంలో అంతులేని ధనలాభం!

First Published | Apr 30, 2023, 9:56 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  చేయి వ్యవహారములు మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీమాతా' జ్యోతిష్యాలయం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
కుటుంబ సభ్యులతోటి అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణమునందు జాగ్రత్తలు అవసరము.  వ్యాపారములందు పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహరించవలెను.  అలసత్వం చేత వచ్చిన అవకాశాలని చేజారుస్తారు. జాగ్రత్త అవసరము. భూ గృహ విక్రయాలు వాయిదా వేట మంచిది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. సమాజము నందు అవమానాలు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల వలన లాభం కలుగును. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
అన్నదమ్ముల తోటి విరోధాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడగలవు. మనసునందు అనేక విధములుగా ఆలోచనలు ఏర్పడి చికాకు పుట్టించిను. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారుల నుండి సమస్యలు ఇబ్బందులు ఏర్పడతాయి. గృహంలో పెద్దవారి  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకున్న వలెను. ప్రతి చిన్న పనిలోనూ అడ్డంకులు ఏర్పడగలవు. వారాంతంలో శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. చేయి వ్యవహారములు మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర
శరీర సౌకర్యం లభిస్తుంది. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ అభివృద్ధి ప్రణాళికలు చేస్తారు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ కనబరుస్తారు. రుణ రోగ బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారము నందు పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అగును. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేయు వ్యవహారములలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా నుండును. వారాంతంలో మానసిక బాధలు. ఇష్టం లేని పనులు చేయడం. కొన్ని విషయాలలో నిరాశ నిస్పృహలకు గురివుతారు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడగలవు.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. భూ గృహ క్రయవిక్రయాలు లాబిస్తాయి. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. చేయ వ్యవహారంలో బుద్ది చాతర్యంతోటి వ్యవహారాన్ని చక్కబెడతారు. వివాహ ప్రయత్నాలు చేయువారు శుభవార్త వింటారు. గృహ సంబంధిత అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమునందు అధికారుల నుంచి గౌరవం  పొందగలరు. వృత్తి వ్యాపారాలు  లాభసాటిగా జరుగును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభించును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. చిన్నబాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. వారాంతంలో వ్యవహారమంతా ప్రతికూలంగా నుండును. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడగలరు.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అభివృద్ధి కార్యక్రమాలలో అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ పనులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగును. రుణ శత్రు బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆకస్మికంగా ధన లాభం కలుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును. వారాంతంలో  మానసికంగా  అనేక ఆలోచనలతోటి తికమకగా ఉంటుంది. తలపెట్టిన పనులు నష్టం రావచ్చు.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగము నందు మీ యొక్క విధిని సక్రమంగా నిర్వహిస్తారు. మీరు ప్రయత్నించిన పనులు ఫలిస్తాయి. మీ బంధువర్గంలో మీ యొక్క విలువను గుర్తిస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉండును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. భూ గృహ క్రయవిక్రయాల వాయిదా వేయడం మంచిది . వాహన ప్రయాణాలయంతో జాగ్రత్త అవసరం. గృహమునందు పెద్దవార యొక్క ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. చేయు వ్యవహారంలో బుద్ధికుశలత తోటి వ్యవహారాన్ని పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను. వారాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడడం.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
చేయు పనియందు శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ధనాధాయ మార్గాలు బాగుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. భూ గృహ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి రుణ రోగ శత్రు బాధలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వారాంతంలో సమాజం నందు సన్మానాలో బహుమానాలు అందుకోగలరు. చేయు వ్యవహారం నందు మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి చేయ పనులు శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది అన్నదమ్ముల  సహాయ సహకారాలు లభిస్తాయి భూ గృహ క్రయ విక్రయాలు నిర్మాణాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం. చేయి వ్యవహారములో బుద్ధి కుశలత తగ్గి ఇబ్బందులు ఎదురవును
కొద్దిపాటి రుణాల తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి అకారణంగా మనస్పర్ధలు రాగలవు. అనుకున్న పనులు అనకు నోట్లు గా సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికార వృద్ధి కలుగును. వారాంతంలో వృత్తి వ్యాపారం నందు జాగ్రత్తవసరము. మనసునందు అనేక ఆలోచనలతోటి తికమకగా వుండును.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
చేయ పని యందు శారీరక శ్రమ అధికంగా ఉండును. ధనాధాయానికి లోటు ఉండదు. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు మందగించును. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబంలో పెద్దవారి  ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానమునకు ఉన్నత విద్య ఉద్యోగం లభిస్తుంది. చేయి వ్యవహారములు చక్కటి ఆలోచనలతోటి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వైభవ జీవితం ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారం నందు ధనలాభం కలుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతోటి కలహాలకు విరోధాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చుల యందు నియంత్రణ అవసరము. వారాంతంలో సమాజము నందు అపకీర్తి రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఉద్యోగమనందు అధికారుల  ఒత్తిడి ఎక్కువగా నుండను.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగును. రుణ శత్రు బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగమనందు అధికారుల తోటి ప్రశంసలు అందుకుంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. కొన్ని సంఘటనలు మానసిక ఉద్రేకతలు భయాందోళనకు గురి అవుతారు. అన్నదమ్ముల తోటి సఖ్యతగా ఉండవలెను. సంతానం తోటి మనస్పర్ధలు రాగలవు. రావలసిన బాకీలు చాకచక్యంగా వసూలు చేసుకొనవలెను. వారాంతంలో కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగము నందు అధికార వృద్ధి కలుగును.

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
చిన్న పాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్నపాటి ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. సంతానానికి ఉన్నత విద్య మరియు ఉద్యోగం లభిస్తుంది. రుణ శత్రువు బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆ కారణంగా మనస్పర్ధలు ఏర్పడగలవు. వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగమునందు అధికారులతోటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. చేయ ఖర్చు యందు ఆలోచించి చేస్తారు. వారాంతంలో అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. గృహమునందు పెద్దవారి  ఆరోగ్యంలో విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మానసిక బాధ ఏర్పడగలవు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

చేయు పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. దేహ కాంతి తగ్గుతుంది. ధనాధాయ మార్గాలు బాగుండును. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులు పరీక్ష నందు ఉత్తీర్ణత సాధిస్తారు. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. రుణ శత్రు బాధలు కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మాట పట్టింపులు ఏర్పడగలవు. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారములు లాభసాటికా జరుగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేయు వ్యవహారములలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వారాంతంలో మానసిక వేదన బాధిస్తుంది. ఇతరులతోటి అకారణంగా కలహాలు విరోధాలు రాగలవు.

Latest Videos

click me!