జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం:
తేది : 30 ఏప్రిల్ 2023
సంవత్సరం :- శోభకృత్
ఆయనం :-ఉత్తరాయణం
మాసం :- వైశాఖం
ఋతువు :- వసంత ఋతువు
పక్షం :-శుక్లపక్షం
వారము:-ఆదివారం
తిథి :- దశమి సాయంత్రం 6.54 ని.వరకు
నక్షత్రం : మఖ మధ్యాహ్నం 2.18 ని.వరకు
యోగం:- వృద్ధి ఉ॥10.22 ని.వరకు
కరణం:- తైతుల ఉ॥5.56 గరజి సాయంత్రం 6.54 ని.వరకు
అమృత ఘడియలు:- ఉదయం 11:38 ని.ల 1.24 ని.వరకు
వర్జ్యం:- రాత్రి 11.04 ని.ల 12.49 ని.వరకు
దుర్ముహూర్తం:-సా.04.33ని. నుండి సా.05.23ని. వరకు
రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
శుభవార్తలు వింటారు . వృత్తి వ్యాపారాలు యందు ఊహించిన ధన లాభం కలుగును. ప్రయత్న పనులలో విజయం సాధిస్తారు . అభివృద్ధి విషయాల తోటి ఇతరులతో ఆలోచనలు చేస్తారు. కీలకమైన సమస్యలను సమయస్ఫూర్తితో టి వ్యవహారం చేయాలి . పై అధికారుల యొక్క పరిచయాలు కలిసి వస్తాయి . ఉద్యోగమునందు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా బాగుంటుంది . మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును .ఓం శుభప్రదాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నూతన వస్తు వాహనాల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి . శుభకార్యాలలో పాల్గొంటారు . విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు . స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు . వృత్తి వ్యాపారం వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది . సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది . తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి .ఈ రాశి వారు ఈరోజు ఓం షణ్ముఖాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
మంచి విషయాలు తెలుస్తాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు . జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు . మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది . నూతన పరిచయాలు కలిసి వస్తాయి . సోదరి సహోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ధన లాభం కలుగుతుంది.కీలకమైన సమస్యల నుండి విముక్తి పొందవచ్చును .అభివృద్ధి పనులు ఆలోచనలు ఆచరణలో పెడతారు . పాత మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు .ఈరోజు ఈ రాశి వారు ఓం చంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
విద్యార్థులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల యందు ఊహంచన ధన లాభం కలుగుతుంది . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు .ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . ఇంట బయట మీ ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది . తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి . ఉద్యోగమునందు అధికారాల యొక్క స్నేహ సంబంధాలు వలన అధికారం లాభాలు కలిసి వస్తాయి. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు ఓం వాచస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శారీరకంగా బలహీనంగా ఉంటుంది . పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అకారణంగా కలహాలు రావచ్చు . కోర్టు వ్యవహారాల్లో ప్రతికూలత వాతావారణం . ఉద్యోగమునందు పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది . వృత్తి వ్యాపారాల యందు మీ అంచనాలు తారుమారవుతాయి. నిత్యంమీతో పాటు ఉండే వారి తోటి విరోధాలకు దూరంగా ఉండడం మంచిది . అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి . ఓం అరుణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
పట్టుదలతో చేసిన పనులు పూర్తి అగును. ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు. వ్యవహారము నందు ప్రతిపందకాలు ఏర్పడతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. అనుకోని సమస్యలు ఏర్పడి బాధ కలిగించును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. శారీరక శ్రమ పెరిగి శరీరం బలహీనత ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓం మహీసుతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఇతరుల విషయాల యందు దూరంగా ఉండటం మంచిది . వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను. చేయ పనులయందు ఆసక్తి లేకుండా ఉండుట . చేయ పనివారితో టి ఇబ్బందులు ఏర్పడతాయి . నిరాశ నిస్పృహలకు లోనవుతారు . సమాజములో అవమానములు కలిగి గౌరవం తగ్గుతుంది . మనస్సు ఆందోళనగా ఉంటుంది . ఆరోగ్యం సమస్యలు ఇబ్బంది పెడతాయి . స్నేహితులతోటి మాట పట్టింపులు వస్తాయి . ఆవేశాన్ని అదుపులో ఉంచుకొని వలెను . వృత్తి వ్యాపారముల యందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది .ఈ రాశి వారు ఈరోజు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండడం . తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారములు యందు సామాన్యమైన లాభం కలుగును . అనవసరమైన ఆలోచనయందు దూరంగా ఉండండి . ఆరోగ్యము విషయం లో ఇబ్బందులు ఏర్పడవచ్చు . అనవసరమైన ప్రయాణాలు చికాకుగా ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడగలవు. ఆవేశంతో వాదనలు వలన సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును . ఓం హిమగర్భాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనవసరమైన జగడాలకు దూరంగా ఉండాలి . ఊహించని ఒడిదుడుకులు ఏర్పడతాయి . వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కఠినంగా మాట్లాడడం వలన కొత్తసమస్యలు ఏర్పడతాయి .మనసునందు అనేకమైన ఆలోచనతోటి ఆందోళనగా ఉంటుంది . బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడగలవు. ఇతరులతోటి వాదన వేయడం మంచిది కాదు. రావలసిన బాకీలు తిరిగి లభించగలవు. శ్రీ రాహు మూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వృత్తి వ్యాపారాలందు ఊహించని ధన లాభం కలుగును. సమాజము నందు మీ మాటకు విలువ పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. చేయు ఖర్చు యందు అప్రమత్తత అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగించును. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగము నందు అధికారుల ఆదర అభిమానములు మానాలు పొందగలరు. ఈ రాశి వారు ఈరోజు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వృత్తివ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి వాదనలకు దూరంగా ఉండండి. మానసికంగా బలహీనత ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు యందు సమయస్ఫూర్తితోటి వ్యవహరించవలెను. చేయని పొరపాటులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆరోగ్య మీద శ్రద్ధ వహించవలెను. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించవలెను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొనవలెను. ఉద్యోగమునందు అధికారులతోటి కలహాలు ఏర్పడవచ్చు. ఈ రాశి వారు ఈరోజు ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కీలకమైన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఎన్ని అవాంతరాలు ఏర్పడిన పట్టుదలతో పనులు పూర్తి చేయవలెను. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల తీరు ఉపశమనం లభిస్తుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ఉద్యోగము నందు అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఈ రోజు ఓం నీలకంఠాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి