వార ఫలాలు: ఈ రాశివారు వీకెండ్ లో ఊహించని శుభవార్తలు వింటారు.

First Published | Nov 27, 2022, 10:05 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  మీ సన్నిహితులే అపకారం చేయాలను చూడు వారు ఎక్కువ అవుతారు.అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇంటా బయట గౌరవం తగ్గుతుంది.

Solar Eclipse on October 24- Beware of this zodiac sign!

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం


Zodiac Sign


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి.గృహమునందు ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు అధికార వృద్ధి కలుగును. వృత్తి వ్యాపారాల యందు అనుకోని ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి  నిర్ణయాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. కుటుంబ అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. భు గృహ నిర్మాణాలు పనులు సానుకూలంగా ముందుకు సాగుతాయి. వారాంతంలో అవశాలు చేతి దాకా వచ్చి జారిపోవచ్చును.  ఇతరుల మీద ద్వేష అసూయలు పెరుగుతాయి. కొన్ని కీలకమైన సమస్యలతోటి మనసు నందు చికాకులు ఏర్పడును. మిత్రులతోటి మనస్పర్ధలు. అనుకోని ఖర్చులు ఏర్పడును. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు మాటలు తూల కొండ చూసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండడం మంచిది.  ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి . దూర ప్రయాణాలు తోటి చికాకులు గా ఉండును. పుత్ర పుత్రికలతోటి గొడవలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికారులతో గొడవలు ఏర్పడును. మీ సన్నిహితులే అపకారం చేయాలను చూడు వారు ఎక్కువ అవుతారు.అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఇంటా బయట గౌరవం తగ్గుతుంది. పని యందు అలసత్వం పెరుగుతుంది. వారాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి.  గృహమునందు కొన్ని కీలకమైన సమస్యలు బుద్ధిబలంతోటి పరిష్కరించుకోవాలి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
మానసిక బాధలుంటాయి . ఆకస్మికంగా ప్రయాణాలు ఏర్పడతాయి.  కీలక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకొనవలెను.  ఆచితూచి వ్యవహారం చేయాలి. సమాజం నందు చేయని పనులకు బాధ్యత వహించాల్సి వస్తుంది. శారీరిక శ్రమ పెరిగి అలసట ఏర్పడుతుంది. మీ ప్రత్యర్థుల మూలంగా అపకార ప్రయత్నాలు జరుగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. వారాంతంలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగమునందు అధికారుల యొక్క స్నేహ లాభాలు కలుగును. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధనలాభం కలుగుతుంది. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4
సంఘము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శారీరకంగా మానసికంగా బలపడతారు. శారీరక శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. చేయు పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. అనుకో ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల యొక్క బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.   ఉద్యోగమునందు సహోదయోగల యొక్క సహాయ సహకారాలు వలన అధికార ప్రాప్తి కలుగును.  నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వారాంతంలో ఇతరులతోటి కలహాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయం ఇబ్బందుల తలెత్తుతాయి. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
శుభవార్తలు వింటారు. సంఘమనందు మీ ప్రతిభకు  తగ్గ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రత్యర్ధులుమీద పై చేయి సాధిస్తారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచనలు ఫలిస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారములు అనుకూలమైన తీర్పులు రావచ్చును. రావలసిన మొండి బకాయిలు చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. భూ గృహ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వారాంతంలో మానసిక ఒత్తిడిలు పెరుగును. కొన్ని కీలక సమస్యలలో భావోద్వేగం పెరిగి ఉద్రేకతలు ఏర్పడతాయి. వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. పశ్చిమదిశ ప్రయణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నిరాశ నిస్పృహలకు లోనవుతారు. అవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికం గా బలంగా ఉన్నప్పటికీ రుణాలు చేయవలసి వస్తుందని. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బందులుంటాయి.  వృత్తి వ్యాపారాలను ధన నష్టం ఏర్పడవచ్చును. పెద్దల యొక్క సూచన మేరకు పెట్టుబడులు పెట్టవలెను. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడుతాయి. వారాంతంలో వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబం నందు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది.  ప్రయాణాలు లాభిస్తాయి. కీలక సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
మనసునందు అనేక ఇబ్బంది కర ఆలోచనలు కలుగుతాయి. ఇంటా బయట కలహాలు ఏర్పడును. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి నష్టం వాటిలను. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగములో అధికారులు ఒత్తిడిలు పెరుగును. గృహమునందు పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.సంఘము నందు గౌర ప్రతిష్టలు తగ్గును. వృతి వ్యాపారాలయం సామాన్యంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలలో పెద్దల యొక్క సలహాలు తీసుకొని వలెను.  అనవసరమైన ఖర్చుల తగ్గించుకొని వలెను. పిల్లల యొక్క చదువు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలమైన తీర్పులు రావచ్చును. సమాజమందు మృదువుగా మాట్లాడుతూ మీయొక్క పనులన్నీ చక్కబెట్టు కుంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. దురాలోచనకు దూరంగా ఉండండి. దూరపు ప్రయాణాలు ఏర్పడతాయి. విదేశ ప్రయాణాలు వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. వారాంతంలో మానసిక ఆరాటం. పనులలో ఆలస్యం. శారీరక శ్రమ పెరిగి పెరుగుతుంది. చెడు స్నేహాలు ఏర్పడతాయి. అనవసరమైన ప్రయాణాలు. సమాజంలో అవమానాలు జరుగవచ్చు. అనవసరమైన ఖర్చులు ఏర్పడును. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఇంటా బయట గౌరవం తగ్గుతుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మనస్సునందు అనేక  బాధలుగా ఉండుట. ఆర్థిక ఇబ్బందులుంటాయి. రుణాలు చేయవలసి వస్తుంది. స్థిరాస్తి విషయంలో గొడవలు ఏర్పడతాయి . ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. గృహ క్రయ విక్రయాల యందు ఆచితూచి వ్యవహరించవలెను . కీలకమైన సమస్యలు బుద్ధి కుశల తోటి పరిష్కరించుకోవాలి . కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. వారాంతంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. బంధువుల  సహాయ సహకారాలు లభిస్తాయి. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఆర్థికం వ్యవహారాలు బాగుంటాయి. శారీరక శ్రమ తగ్గి ప్రశాంత లభించును. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు మీ ప్రతిభ తగ్గ ప్రతి గౌరవం లభిస్తుంది.  వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. మిత్రుల యొక్క ఆదర అభిమానం పొందుతారు.  కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తూ వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగము నందు ప్రోత్సాహం లభించును. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. చేయు పనులలోఎంతటి కష్టపనైనా  పట్టుదలతో విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. మానసికంగా శారీరకంగా బలపడతారు. వారాంతంలో ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు యందు ఆచితూచి వ్యవహరించవలెను. ఇతరులతో వాదనలు వాదనకు దూరంగా ఉండటం మంచిది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చును. వివాదాలకు దూరంగా ఉండండి. సమాజంలో అవమానాలు జరుగవచ్చు. మనస్సునందు అనేక విధముల బాధలు ఏర్పడతాయి. మిత్రుల తోటి సన్నిహితంగా ఉండుండి. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం నందు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. గృహ మార్పులు చేస్తారు. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడుతాయి. నిరాశ నిస్పృహలకు లోనవుతారు.  పొదుపు చేసిన ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. శత్రుమూలముగా ఇబ్బందులు ఏర్పడతాయి. వారాంతంలో వృత్తి వ్యాపారాలు యందు అనుకోని ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు కొన్ని విషయాలలో మీకు అండగా నిలబడతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా జరుగును. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ఊహించని ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఉద్యోగమునందు అధికార అభివృద్ధి. నూతన వస్తు వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయ బంధువర్గం పెరుగుతుంది.  విద్యార్థులు ప్రతిభ పాటలు కనబరిచారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగును. సమాజము నందు  నందు సన్మానాలు బహుమానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం. బంధువర్గంలో మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Latest Videos

click me!